Window AC vs Air Coolers : బాబోయ్ ఎండలు.. విండో ఏసీనా? ఎయిర్ కూలర్? ఈ సమ్మర్‌లో ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్
Window AC vs Air Coolers: విండో ఏసీ కొంటున్నారా? ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఇందులో ఏది కొంటే బెటర్? ఎందులో ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- May 1, 2026 / 03:59 PM IST
Window AC vs Air Cooler
- విండో ఏసీ ఫాస్ట్ కూలింగ్ ఇస్తుంది.. వేడిలో ఎయిర్ కూలర్ బెస్ట్ ఆప్షన్
- ఎయిర్ కూలర్‌కు తక్కువ విద్యుత్ అవసరం.. ఏసీతో పవర్ బిల్లు భారీగా వస్తుంది
- ఏసీ కొనడం చాలా ఖరీదైనది.. ఎయిర్ కూలర్ చాలా చవక.. ఎందులో బెనిఫిట్స్ ఎక్కువ?
Window AC vs Air Coolers : అసలే సమ్మర్.. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎండల కారణంగా చాలామంది కొత్త ఏసీలు, కూలర్లు ఇంటికి తెచ్చుకుంటున్నారు. మీరు ఉండేది చిన్న అపార్ట్‌మెంట్ లేదా పెద్ద బంగ్లా అయినా ఎండల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఎండ వేడిని తట్టుకునేందుకు కొత్త ఏసీ లేదా ఎయిర్ కూలర్ తీసుకోవాలని మీరు చూస్తుంటే ఇది మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో విండో ఏసీ లేదా ఎయిర్ కూలర్లకు భారీ డిమాండ్ ఉంది.
ఈ రెండు సౌకర్యపరంగా చాలా బెస్ట్. అందుకే ఇందులో ఏది తీసుకోవాలంటే (Window AC vs Air Coolers) చెప్పడం కష్టమే. మీ బడ్జెట్ బట్టి డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కూలింగ్ పర్ఫార్మెన్స్, విద్యుత్ వినియోగం, ధర మొత్తం ఉంటుంది? ఎయిర్ కూలర్‌లతో పోలిస్తే విండో ఏసీతో బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు వివరంగా పోల్చి చూద్దాం..
కూలింగ్, పర్ఫార్మెన్స్ :
రూమ్ కూలింగ్ పరంగా పరిశీలిస్తే.. విండో ఏసీలు రూమ్ కూలింగ్ కోసం కంప్రెసర్ రిఫ్రిజెరెంట్లు ఉంటాయి. అలాగే, ఎయిర్ కూలర్ల పర్ఫార్మెన్స్ తేమతో ప్యాడ్‌ల గుండా గాలి బయటకు వచ్చి రూమ్ కూలింగ్ చేస్తుంది. సిటీలో తేమ ఉన్న గాలితో పోలిస్తే.. వేడిగా, పొడిగా ఉండే వాతావరణంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. విండో ఏసీల కన్నా ఎయిర్ కూలర్లు వాడటమే బెస్ట్.
విద్యుత్ వినియోగం :
విద్యుత్ ఖర్చు పరంగా దీర్ఘకాలంలో భారీగా విద్యుత్ బిల్లులు పెరుగుతాయి. ఎయిర్ కూలర్లే పైచేయి. ఎందుకంటే పవర్ వినియోగం భారీగా పెరగదు. ఎంతసేపు నడిపినా మీ నెలవారీ ఖర్చులను పెద్దగా పెరగవు. విండో ఏసీ కూడా అంతే.. అధిక విద్యుత్ వినియోగంతో పాటు పవర్ సేవింగ్ మోడ్ ఉన్నా అదేపనిగా వాడితే మీ పవర్ బిల్లు పెరుగుతూనే ఉంటుంది.
Read Also : Jio vs Airtel : జియో vs ఎయిర్‌టెల్.. రూ.355 రీఛార్జ్ వార్.. డేటా, బెనిఫిట్స్ ఎందులో ఎక్కువంటే?
ధర ఎంతంటే? :
విండో ఏసీలు కొనాలన్నా నడపాలన్నా ఖరీదే. 2026లో 1.5-టన్ ఏసీ యూనిట్ సుమారు రూ. 30వేల నుంచి రూ. 38వేల వరకు అమ్ముడవుతుంది. మీరు ఇన్‌స్టాలేషన్ కోసం కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సుమారు రూ. 1,200 నుంచి రూ. 2,500 వరకు ఖర్చు కావచ్చు.
విండో ఏసీ కొన్న తర్వాత సర్వీసింగ్, గ్యాస్ రీఫిల్‌లు, మెయింంట్ నెన్స్ కోసం ఇంకా డబ్బు ఖర్చు చేస్తారు. గంటకు సుమారు 1.2 నుంచి 1.5 యూనిట్ల పవర్ కూడా అవసరం. గంటకు దాదాపు రూ. 10 నుంచి రూ. 13 వరకు ఖర్చు అవుతుంది.
ఎయిర్ కూలర్లు చాలా చౌకగా ఉంటాయి. డెసర్ట్ కూలర్ల ధర సుమారుగా రూ. 8,500 నుంచి రూ. 12,500 వరకు ఉంటుంది. వీటికి ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు, కేవలం నీటితో నింపి వాడుకోవడమే. గంటకు కేవలం 0.15 నుంచి 0.3 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తాయి. గంటకు సుమారు రూ. 1.50 నుంచి రూ. 2.50 వరకు ఖర్చు అవుతుంది. డబ్బు ఆదా చేయాలంటే ఇవే బెస్ట్ ఆప్షన్.
విండో ఏసీ, ఎయిర్ కూలర్ ఏది కొనాలి? :
ఈ రెండింటిలో ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. కూలింగ్, రూమ్ టెంపరేచర్ కంట్రోలింగ్ కోసమైతే విండో ఏసీ తీసుకోవడం బెటర్. లేదంటే మీ నెలవారీ పవర్ బిల్లులు భారీగా వస్తాయి. తక్కువ ఖర్చుతో సౌకర్యంగా ఉండాలంటే ఎయిర్ కూలర్ తీసుకోవడమే మంచిది.
