Window vs Split AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? విండోస్ ఏసీనా? స్ప్లిట్ ఏసీనా? ఏది కొంటే బెటర్? ఎక్స్‌పర్ట్స్ టిప్స్ మీకోసం..!
Window vs Split AC : విండో ఏసీ కొనాలా? స్ప్లిట్ ఏసీ కొనాలా? ఏది కొంటే మంచిది? పవర్ ఆదాతో పాటు కూలింగ్ ఎక్కువ ఎందులో ఉంటుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Window vs Split AC
Window vs Split AC : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కాసేపు ఏసీ లేదా కూలర్ వేయకుండా ఉండలేని పరిస్థితి. ఎండ వేడిని తట్టుకునేందుకు తప్పనిసరిగా రెండింటిలో ఏదో ఒకటి ఉండాల్సిందే.. మీరు కూడా ఈ సమ్మర్ సీజన్‌లో మీ ఇంటికి కొత్త ఏసీ కొని తీసుకురావాలని అనుకుంటున్నారా?
అయితే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఇంకా ఎండలు పెరిగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఏసీలు కూలింగ్ కెపాసిటీ, తక్కువ విద్యుత్ వినియోగించే కొత్త ఫీచర్లు కలిగిన మోడల్స్ ఎన్నో ఉన్నాయి.
అందులో చాలామందికి విండోస్ ఏసీలు, స్ప్లిట్ ఏసీలు కొంటే బెటరా? అనేది తేల్చుకోలేరు. ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్? ఏ ఏసీతో ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
విండో ఏసీ vs. స్ప్లిట్ ఏసీ.. ఏది కొనాలి? :
ఏసీ కొనేటప్పుడు మొదటిగా విండో ఏసీ కొనాలా? లేదా స్ప్లిట్ ఏసీ కొనాలా అనేది నిర్ణయించుకోవాలి. ఈ రెండింటికీ లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
విండో AC : ఈ మోడల్ అన్ని స్పేర్ పార్టులను కలిపిన కాంపాక్ట్ యూనిట్‌లో వస్తుంది. ఇన్‌స్టాల్ చేయడం, మెయింట్‌నెన్స్ సులభంగా ఉంటుంది. కానీ, స్ప్లిట్ ఏసీలతో పోలిస్తే బాగా సౌండ్ చేస్తాయి.
స్ప్లిట్ ఏసీ : స్ప్లిట్ ఏసీ రెండు యూనిట్లను కలిగి ఉంటుంది (అవుట్‌డోర్, ఇండోర్).. అంటే తక్కువ సౌండ్ వస్తుంది అనమాట. ఇన్‌స్టాలేషన్ చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఖరీదైనది కూడా. మెయింట్‌నెన్స్ కూడా విండో ఏసీ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది.
సరైన ఏసీ కెపాసిటీని ఎంచుకోవాలి :
ముందుగా ఏసీ టైప్ ఎంచుకోవాలి. ఆ తర్వాత కూలింగ్ కెపాసిటీ, ఎన్ని టన్ అనేది తెలుసుకోవాలి. అంటే, కూలింగ్ కెపాసిటీ సాధారణమైనవి 1 టన్, 1.5 టన్, 2 టన్ అని ఉంటాయి. ఒక గదిలో ఎక్కువ మంది ఉండే ఆ గది తగినట్టుగా ఏసీ టైప్ ఎంచుకోవాలి. గది పెద్దదిగా ఉంటే కూలింగ్ ఎక్కువ కెపాసిటీ ఉండాలి.
ఇన్వర్టర్ ఏసీ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఏది బెటర్ అంటే? :
పవర్ సేవింగ్ ఆప్షన్ ఎంచుకోవడానికి ఇన్వర్టర్, నాన్-ఇన్వర్టర్ ఏయే టెక్నాలజీ కలిగి ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇన్వర్టర్ ఏసీ : ఇన్వర్టర్ ఏసీలు విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే అవసరమైన కూలింగ్‌కు అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి. పెద్ద గదులను తొందరగా చల్లబరుస్తాయి. ఒకే స్థాయిలో టెంపరేచర్ అందిస్తాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఇన్వర్టర్ ఏసీలు వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ (VFD) టెక్నాలజీని ఉపయోగిస్తాయి.
నాన్-ఇన్వర్టర్ ఏసీ : స్థిరమైన వేగంతో పనిచేస్తాయి. ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. గదిని నెమ్మదిగా కూల్ చేస్తాయి. ఇన్వర్టర్ ఏసీల కన్నా తక్కువ శక్తి సామర్థ్యం కలిగి ఉంటాయి.
ఎనర్జీ స్టార్ రేటింగ్ :
ఏసీలను కొనే ముందు ఎల్లప్పుడూ BEE (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) స్టార్ రేటింగ్‌ను చెక్ చేయండి. రేటింగ్ 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకు ఉంటుంది. అత్యధికంగా 5-స్టార్ ఏసీలు ఉంటాయి. ఇవి అత్యంత శక్తివంతమైనవి, అంతేకాదు పవర్ కూడా ఆదా చేస్తాయి.
ఇన్‌స్టాలేషన్, వారంటీ వివరాలివే :
ఇన్‌స్టాలేషన్ : విండో ఏసీలు, స్ప్లిట్ ఏసీల కన్నా ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఏసీలను సంబంధిత ఎక్స్‌పర్ట్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి.
వారంటీ : అన్ని కంపెనీలు ఏసీ యూనిట్‌కు ఒక ఏడాది వారంటీతో పాటు కంప్రెసర్‌కు 5 ఏళ్ల వారంటీని అందిస్తాయి. కొనుగోలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ వారంటీ కండీషన్లను చెక్ చేయండి.
చెక్ చేయాల్సిన ఇతర ఫీచర్లు :
కొత్త ఏసీలు సౌలభ్యంతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి.
స్మార్ట్ ఏసీలు : Wi-Fi ఏసీలను స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు.
Read Also : Apple iPhone 15 : అమెజాన్‌లో క్రేజీ ఆఫర్.. లక్ష విలువైన ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?
ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్లు : కొన్ని ఏసీలలో ఫిల్టర్లు ఉంటాయి. గాలి నుంచి అలెర్జీ కారకాలు, ధూళిని తొలగించడంలో సాయపడతాయి. ఇండోర్ గాలి క్వాలిటీని పెంచుతాయి.
డీహ్యూమిడిఫైయర్ మోడ్ : తేమ స్థాయిని తగ్గించడంలో సాయపడుతుంది. వర్షాకాలంలో మీ గదిని సౌకర్యవంతంగా చేస్తుంది. విద్యుత్ బిల్లుల విషయంలో రాజీ పడకుండా టాప్ కూలింగ్ అందించే ఏసీని ఎంచుకోవచ్చు.