JioHotstar : IPL మ్యాజిక్.. జియోహాట్‌స్టార్ సరికొత్త రికార్డు.. 10 కోట్ల సబ్‌స్క్రైబర్లను దాటేసింది.. చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!
JioHotstar Record : జియో హాట్‌స్టార్ 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది.

JioHotstar crosses 100 million subscribers
JioHotstar Record : ఐపీఎల్ మ్యాజిక్‌తో జియో హాట్‌స్టార్ ప్రభంజనం సృష్టించింది. భారత మార్కెట్లో ఐపీఎల్ రీఛార్జ్ ప్లాన్ల ద్వారా 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటేసింది. తద్వారా దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.
దీనికి ప్రధాన కారణం రిలయన్స్ జియో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అతి తక్కువ ధరకు అందించడమే.. అందులో ముఖ్యంగా ధర రూ. 299 కన్నా ఎక్కువ. ఐపీఎల్ 2025 సీజన్ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను జియోహాట్‌స్టార్ ఆకర్షించింది.
జియో హాట్‌స్టార్ IPL 2025 వ్యూహం ఫలించింది. ఇప్పుడు ఐపీఎల్ ప్రభావం కనిపిస్తోంది. ఎందుకంటే.. కంపెనీ వీక్షకుల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. జియో హాట్‌స్టార్ 100 మిలియన్ (10 కోట్ల) సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని ప్రకటించింది. ఇదొక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించింది.
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. రిలయన్స్ జియో రూ.299 నుంచి మొబైల్ ప్లాన్‌లతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించడంతో ఎక్కువ ఆదరణ పెరిగింది.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ఇతర టెలికాం ఆపరేటర్లు అందించే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు కూడా ఇందులో చేర్చింది. ఫలితంగా ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలోనే వంద మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటేసింది.
స్ట్రీమింగ్‌లో జియో సరికొత్త రికార్డు :
భారత్‌లో జియో హాట్‌స్టార్ అత్యంత ఆదరణ పెరిగింది. దీని ఫలితంగా సరికొత్త రికార్డు సృష్టించింది. జియో హాట్‌స్టార్ దేశంలో స్ట్రీమింగ్‌ను విప్లవాత్మకంగా మార్చింది. ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రీమియం సర్వీస్ నుంచి లక్షలాది మంది జీవితాల్లో భాగమైంది.
ప్రత్యేకమైన ఫ్రీ వ్యూ మోడల్ వ్యూహం, సరసమైన సబ్‌స్క్రిప్షన్ ధరలు, ప్రముఖ టెల్కోలతో లోతైన భాగస్వామ్యాలు కంటెంట్ యాక్సెస్‌ను మరింత పెంచాయి. ఈ సందర్భంగా జియోస్టార్ CEO కిరణ్ మణి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వినోదాన్ని అందించడే మా లక్ష్యం. 100 మిలియన్ల (10 కోట్లు) మార్కును దాటడం ఇందుకు నిదర్శనమన్నారు.
రూ. 299 రీఛార్జ్‌పై ఆఫర్ :
ఐపీఎల్ చూడాలనుకునే వినియోగదారుల కోసం జియో ఈ రీఛార్జ్ తీసుకొచ్చింది. ఎందుకంటే.. ఈ రీఛార్జ్‌తో ఐపీఎల్ ఆన్‌లైన్‌లో చూడొచ్చు. వినియోగదారులకు జియో హాట్‌స్టార్‌కు కూడా యాక్సెస్ అందిస్తోంది. అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ కింద కస్టమర్లకు 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వినియోగదారులు 4K క్వాలిటీ వరకు ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లను చూడొచ్చు.
జియో రూ. 355 రీఛార్జ్ :
రిలయన్స్ జియో రూ. 355 ప్లాన్ విషయానికి వస్తే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంది. 25GB డేటా అందిస్తోంది. మీరు ఈ డేటాను 30 రోజుల్లోపు ఉపయోగించవచ్చు.