Income Tax Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ మారబోతున్నాయి.. ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోండి.. డొంట్ మిస్..!

Income Tax Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను శ్లాబుల నుంచి క్రెడిట్ కార్డు రూల్స్, యూపీఐ సర్వీసులు సహా ఇతర నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Income Tax Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ మారబోతున్నాయి.. ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోండి.. డొంట్ మిస్..!

Income Tax Rules

Updated On : March 27, 2025 / 7:18 PM IST

Income Tax Rules : కొత్త ఆర్థిక సంవత్సరం త్వరలో ప్రారంభం కానుంది. రాబోయే ఆర్థిక ఏడాదిలో లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే మరెన్నో మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్నులో అనేక మార్పులు ఉండనున్నాయి.

Read Also : Oppo F29 5G : కొత్త 5G ఫోన్ కావాలా? అతి తక్కువ ధరకే ఒప్పో F29 5G కొనేసుకోండి.. ఇంకా తగ్గాలంటే?

అంతేకాదు.. కొత్త పన్ను శ్లాబులు, క్రెడిట్‌ కార్డు రివార్డులు, యూపీఐ సర్వీసులకు సంబంధించి నిబంధనలు కూడా మారనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త మార్పులన్నీ అమల్లోకి రానున్నాయి. కొత్త పన్ను విధానం ప్రకారం.. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి టాక్స్ ఉండదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలతో రూ.12.75 లక్షల వరకు నో టాక్స్ అనమాట. అదేవిధంగా, రూ.25వేల రిబేట్‌ను కూడా రూ.60 వేలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.

ప్రస్తుతం 60ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు బ్యాంకుల్లో డిపాజిట్లపై వార్షిక వడ్డీ రూ.50వేలు దాటితే.. (TDS) ఛార్జ్ చేస్తారు. అయితే, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు. అలాగే, 60 ఏళ్ల లోపు వారికి ఇదే మొత్తాన్ని రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరిగింది.

లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌-LRS కింద ఆర్థిక ఏడాదిలో రూ.7 లక్షలు దాటితే.. TCS వసూలు చేస్తున్నారు. అయితే, దీనిపై లిమిట్ రూ.10 లక్షలకు పెంచారు. బ్యాంకుల్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఆ మొత్తాన్ని స్టూడెంట్ ఫీజు కోసం విదేశాలకు పంపితే ఎలాంటి TCS ఉండదు.

క్రెడిట్‌ కార్డు నిబంధనలివే :
ఎస్బీఐ కార్డ్స్ క్రెడిట్‌ కార్డుల రివార్డులపై కోత విధించింది. ఎయిరిండియా టికెట్‌, స్విగ్గీ బుకింగ్‌లపై రివార్డులను కూడా తగ్గించింది. ఎయిరిండియా SBI ప్లాటినమ్‌ కార్డు, ఎస్‌బీఐ సింప్లీక్లిక్‌ క్రెడిట్‌ కార్డు, ఎయిరిండియా SBI సిగ్నేచర్‌ కార్డుదారులకు వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అన్ని బెనిఫిట్స్ తగ్గించనుంది.

ఏప్రిల్ 18 నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం విస్తారా క్రెడిట్‌ కార్డు రివార్డులను తగ్గించనుంది. ఆ సమయంలో యూజర్లు ఎవరైనా క్రెడిట్ కార్డును రెన్యువల్‌ చేస్తే ఎలాంటి వార్షిక ఛార్జీలూ పడవు. IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ కూడా మార్చి 31 తర్వాత రెన్యువల్‌ అయ్యే విస్తారా కార్డులకు యానివల్ ఫీజు ఎత్తేయనుంది.

Read Also : Motorola Razr 60 Series : ఖతర్నాక్ ఫీచర్లతో మోటోరోలా మడతబెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ధర ఎంతో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!

యూపీఐ సర్వీసులు పనిచేయవు :
మీ మొబైల్ నెంబర్ ఇన్‌యాక్టివ్‌ ఉంటే ఏప్రిల్‌ 1 నుంచి యూపీఐ సర్వీసులు పనిచేయవు. ఇప్పటికే బ్యాంకులు, పేమెంట్‌ ప్రొవైడర్లను NPCI ఆదేశించింది. ఆయా ఫోన్ నంబర్లను వెంటనే డీయాక్టివేట్‌ చేయాలని సూచించింది. ఏప్రిల్ నుంచి యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో డబ్బులను బ్యాంక్‌ అకౌంట్లకు పంపుకోవచ్చు. యూపీఐ లైట్‌ కోసం పిన్‌, పాస్‌కోడ్‌, బయోమెట్రిక్‌ తప్పనిసరిగా ఉండాలి.

ప్రీమియం మొత్తం రూ.2.5 లక్షలు దాటిన యులిప్స్‌లో పెట్టుబడులకు విత్‌డ్రా చేసేటప్పుడు క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ తప్పనిసరి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి NPS వాత్సల్య పథకం కింద పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్‌ 80CCD (1B) కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి.