Flipkart Winter Fest : ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై సగానికి పైగా డిస్కౌంట్.. డోంట్ మిస్!

Flipkart Winter Fest : వింటర్ ఫెస్ట్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, ఎస్ 21 ఎఫ్ఈ 5జీలను 50శాతం కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లతో సొంతం చేసుకోవచ్చు.

Flipkart Winter Fest : ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై సగానికి పైగా డిస్కౌంట్.. డోంట్ మిస్!

Winter Fest _ Samsung S series 5G phone on Flipkart sale, get up to 50 Percent discount

Updated On : December 24, 2023 / 6:04 PM IST

Flipkart Winter Fest : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ 5జీ ఫోన్లు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ వింటర్ ఫెస్ట్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ 5జీ ఫోన్‌లపై డిసెంబర్ 31 వరకు సగం ధర కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్‌లను బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు మరింత తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్-ఎండ్ సేల్, సూపర్ వాల్యూ డేస్ సమయంలో తగ్గింపుతో ఫోన్‌లను కొనుగోలు చేయలేకపోతే ఇప్పుడు మరో అవకాశం అందిస్తోంది.

Read Also : Samsung Galaxy A Series : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ ఎ15, గెలాక్సీ ఎ25 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో వింటర్ ఫెస్ట్ మొదలైంది. డిసెంబర్ 31న ఈ సేల్‌ ముగియనుంది. దాదాపు అన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. అయితే, మీరు హై-ఎండ్ శామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. ఈ సేల్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తుంది. ఈ సేల్‌లో మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్లను 50శాతం కన్నా ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌లు కూడా మీ సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ 21 ఎఫ్ఈ 5జీ :
ఈ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.69,999కు సొంతం చేసుకోవచ్చు. మీరు డిస్కౌంట్ తర్వాత సేల్ సమయంలో రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, బ్యాంక్ డీల్‌లో కంపెనీ ఈ ఫోన్‌పై 10శాతం అదనపు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ. 25,350 వరకు కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు ఎంచుకున్న కొన్ని మోడళ్లపై అదనంగా రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు.

Winter Fest _ Samsung S series 5G phone on Flipkart sale, get up to 50 Percent discount

Samsung S series 5G phones

స్పెసిఫికేషన్ల పరంగా.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫొటోలు క్యాప్చర్ తీసేందుకు రెండు 12ఎంపీ, ఒక 8ఎంపీ కెమెరాలను ఉపయోగిస్తారు. ఓఐఎస్ లేదా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఫోన్ ప్రాధమిక కెమెరా ఫీచర్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 32ఎంపీ కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 4500ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. హార్డ్‌వేర్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ :
ఈ శాంసంగ్ ఫోన్ 56శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఈ డివైజ్ వాస్తవానికి రూ. 85,999కి జాబితా అయింది. కానీ విక్రయంలో భాగంగా ఇప్పుడు రూ. 36,999కి మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లో మీకు 10శాతం అదనంగా డిస్కౌంట్ ఉంటుంది. స్వాప్ డీల్‌లో బిజినెస్ కస్టమర్‌లకు రూ.25,550 వరకు తగ్గింపును అందిస్తుంది.

కొన్ని మోడళ్లపై రూ. 3వేలు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.1-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. అదనంగా, ఫోన్ తయారీదారు అందించే 50ఎంపీ ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 3700ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఈ ఫోన్‌కు పవర్ అందిస్తుంది.

Read Also : Samsung Galaxy Z Fold 5 : క్రిస్మస్ సేల్ ఆఫర్లు.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5పై ఏకంగా రూ. 9వేలు తగ్గింపు..