Samsung Galaxy Z Fold 5 : క్రిస్మస్ సేల్ ఆఫర్లు.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5పై ఏకంగా రూ. 9వేలు తగ్గింపు..
Samsung Galaxy Z Fold 5 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. క్రిస్మస్ సేల్ సమయంలో ఏకంగా రూ.9వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung Galaxy Z Fold 5 available with Rs 9K discount offer during Christmas sale
Samsung Galaxy Z Fold 5 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 అధికారిక శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తెచ్చింది.
Read Also : Samsung Galaxy A14 5G : శాంసంగ్ గెలాక్సీ A14 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. కేవలం రూ.14,499కే సొంతం చేసుకోండి!
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5పై రూ. 16వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో బ్యాంక్, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను కొనుగోలు చేయలేని వ్యక్తులు అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకు పొందవచ్చు. లేటెస్ట్ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 భారీ తగ్గింపు ఆఫర్ :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 మోడల్ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో రూ. 1,54,999 ప్రారంభ ధరతో లిస్టు అయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 9వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ మడతబెట్టే ఫోన్ ధర ప్రభావవంతంగా రూ. 1,45,999 తగ్గుతుంది.
అదనంగా, శాంసంగ్ ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ ద్వారా అదనంగా రూ. 7వేలు తగ్గింపును అందిస్తుంది. ముఖ్యంగా సాధారణ ఎక్స్ఛేంజ్ ఆప్షన్ పరిగణించే వారికి మొత్తం ధరను గణనీయంగా తగ్గిస్తుంది. శాంసంగ్ పైన పేర్కొన్న బోనస్ ఆఫర్‌తో పాటు రెగ్యులర్ ఎక్స్ఛేంజ్‌పై రూ. 75వేల వరకు తగ్గింపును ఇస్తుందని పేర్కొంది. అయితే, చివరి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ విలువ నిర్దిష్ట మోడల్, పాత ఫోన్ స్టేటస్ బట్టి మారుతుందని గుర్తుంచుకోండి.

Samsung Galaxy Z Fold 5 discount
ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ. 9వేలు డిస్కౌంట్ :
వినియోగదారులకు ఎక్స్ఛేంజ్ ఆప్షన్ పరిగణనలోకి తీసుకోవడానికి అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మీరు పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయకూడదంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో ఇప్పటికీ రూ.9వేలు డిస్కౌంట్ పొందవచ్చు. రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఫోల్డబుల్ ఫోన్‌పై మరికొంత తగ్గింపు లభించే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ మోడల్ రూ. 3,504 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ఓపెన్ కూడా తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం రూ.3,504 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ ఓపెన్ ఇటీవల భారత మార్కెట్లో ధర రూ. 1,39,999కి ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మడతబెట్టే ఫోన్ ధర రూ. 1,36,495కి పడిపోయింది. ఈ డీల్ గడువు ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు. కానీ, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లు రెండూ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.