Womens Day 2026 ( Image Credit to Original Source )
Womens Day 2026 : మహిళలకు అద్భుతమైన న్యూస్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యెస్ బ్యాంక్ యెస్ ఎసెన్స్ ఉమెన్స్ శాలరీ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ఉద్యోగం చేసే మహిళల కోసం ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ శాలరీ అకౌంట్ ద్వారా హెల్త్, వెల్నెస్, లైఫ్ స్టయిల్ బెనిఫిట్స్ ద్వారా బ్యాంకింగ్ ఫీచర్లను ఒకే ప్లాట్ ఫారంపై అందిస్తుంది.
ఈ ఉమెన్ శాలరీ అకౌంట్లలో మొదటి ఏడాది ఫ్రీ లాకర్ సౌకర్యం, ఏడాది పాటు రూ.5 లక్షల వరకు కాంప్లిమెంటరీ హెల్త్ కవర్ కూడా అందిస్తామని యెస్ బ్యాంకు తెలిపింది. అకౌంటుదారులకు కాంప్లిమెంటరీ ఎలిగెన్స్ డెబిట్ కార్డు కూడా అందించనున్నట్టు యెస్ బ్యాంక్ తెలిపింది. ఏడాదిలో ఒకసారి ఫ్రీగా హెల్త్ టెస్టులు సైతం ఈ అకౌంట్ ద్వారా అందించనున్నట్టు పేర్కొంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి ఏడాదిలో మార్చి 8న జరుపుకుంటారు. జీవితంలోని అన్ని రంగాలలో మహిళలు, బాలికలు సాధించిన విజయాలను గుర్తించేందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
రూ.5 లక్షల ఆరోగ్య బీమా, 5శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు :
డెబిట్ కార్డు ద్వారా ఎంపిక చేసిన కేటగిరీల్లో 5 శాతం క్యాష్ బ్యాక్ ఏడాదికి రూ.6వేల వరకు పొందవచ్చు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ స్పెషల్ అకౌంట్ అందిస్తున్నామని తెలిపింది. ఫస్ట్ ఇయర్ రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుందని తెలిపింది.
మహిళల కోసం రూ.4590 కోట్ల లోన్లు :
ప్రత్యేకించి మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ అద్భుతమైన పథకం తీసుకొచ్చింది. 500 మిలియన్ డాలర్ల (రూ.4590 కోట్లు) లోన్ సౌకర్యాన్ని అందిస్తుంది.
స్పెషల్ హోం లోన్లు :
ఎల్ అండ్ టీ ఫైనాన్స్ కంపెనీ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం అద్భుతమైన హోమ్ లోన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్పెషల్ హోం లోన్ స్కీమ్ స్ఫూర్తి పేరుతో ప్రవేశపెట్టింది. హోమ్ లోన్స్‌పై గరిష్ఠంగా 25 ఏళ్లు, ఇండస్ట్రీ ప్రాపర్టీల గ్యారెంటీతో 12 ఏళ్ల వరకు టెన్యూర్‌పై లోన్లు అందిస్తుంది.
ఏదైనా ఒక బిజినెస్ పెట్టి అందులో కనీసం 50 శాతం షేర్ ఉండాలి. అలాగే రూ.5 లక్షల వార్షిక లాభం పొందే మహిళలు ఈ లోన్లు పొందవచ్చు. తక్కువ వడ్డీ రేట్లు, నిబంధనలతో రూ.75 లక్షల వరకు లోన్ పొందవచ్చు.