Xiaomi 17 Ultra Price Drop : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ షావోమీ 17 అల్ట్రాపై ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్..!

Xiaomi 17 Ultra Price Drop : కొత్త షావోమీ 17 అల్ట్రా ఫోన్ కోసం చూస్తున్నారా? ఫొటోగ్రఫీ కిట్ ప్రో కూడా ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 20వేల వరకు తగ్గింపు పొందవచ్చు.. అది ఎలాగంటే?

Xiaomi 17 Ultra price drop

  • బ్యాంక్ ఆఫర్లతో షావోమీ 17 అల్ట్రాపై రూ. 10,000 తగ్గింపు
  • రూ. 19,999 విలువైన ఫొటోగ్రఫీ కిట్ ప్రో కూడా ఫ్రీగా పొందొచ్చు.
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో వస్తుంది
  • 50ఎంపీ 50MP అల్ట్రావైడ్, 200MP 1/1.4-అంగుళాల టెలిఫోటో

Xiaomi 17 Ultra Price Drop : కొత్త షావోమీ ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ ఈ ఏడాది మార్చిలో షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా ఫోన్లను లాంచ్ చేసింది.

ఈ అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ట్రిపుల్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రూ. 1,39,999 ధరకు లభిస్తోంది. అయితే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ (Xiaomi 17 Ultra Price Drop)ను రూ. 20వేలు తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లో భాగంగా ఫొటోగ్రఫీ కిట్ ప్రోను ఫ్రీగా పొందొచ్చు.

ఇతర ఫీచర్లతో పాటు మాగ్నెటిక్ ఫోన్ కేస్, 2,000mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోగ్రఫీ గ్రిప్, రొటేటబుల్ ఫిల్టర్ రింగ్ (67mm) ఉంటాయి. మీరు ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఆఫర్ వివరాలు, ధర, స్పెసిఫికేషన్‌లపై ఓసారి లుక్కేయండి..

Read Also : Amazon-Flipkart Sale Alert : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్స్.. ఈ కార్డులతో కొంటే క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లతో భారీ సేవింగ్స్!

షావోమీ 17 అల్ట్రా ధర, బెనిఫిట్స్ :
ఫ్లాగ్‌షిప్ షావోమీ 17 అల్ట్రా ఫోన్ బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1,39,999 (16GB + 512GB) ధరకు అందుబాటులో ఉంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లు, HDFC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా.. చెక్అవుట్ వద్ద అదనంగా మరో రూ. 10వేలు తగ్గింపు ఆటోమేటిక్‌గా అప్లయ్ అవుతుంది.

అంతేకాకుండా.. ప్రస్తుతం బ్రాండ్ వెబ్‌సైట్‌లో రూ. 19,999కి లిస్టు అయిన షావోమీ 17 అల్ట్రా ఫొటోగ్రఫీ కిట్ ప్రో, కార్ట్‌లో ఫ్రీ గిఫ్ట్ అందిస్తుంది. కొనుగోలుదారులు 5వేల వరకు ఎంఐ పాయింట్లను కూడా సంపాదించవచ్చు. ఫ్యూచర్ కొనుగోళ్ల కోసం వీటిని వాడుకోవచ్చు. ఇంకా, ఈ డీల్‌ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వినియోగదారులు తమ పాత ఫోన్ ట్రేడ్-ఇన్ చేయడం ద్వారా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

షావోమీ 17 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
షావోమీ 17 అల్ట్రా ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఓఎల్ఈడీ 12-బిట్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ షావోమీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ప్రీ ఇన్‌స్టాల్ షావోమీ హైపర్OS 3తో వస్తుంది. రైటింగ్, ఇంటర్‌ప్రెటేషన్, సెర్చ్, స్పీచ్ రికగ్నిషన్ కోసం అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది. 90W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీ అందిస్తుంది.

కనెక్టివిటీ విషయానికొస్తే..
ఈ IP68-రేటెడ్ హ్యాండ్‌సెట్ Wi-Fi 7, బ్లూటూత్ 6, NFC, eSIM సపోర్ట్‌ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. షావోమీ 17 అల్ట్రాలో 50MP లైట్ ఫ్యూజన్ 1050L LOFIC 1-అంగుళాల OIS మెయిన్ కెమెరా, 50MP 1/2.75-అంగుళాల అల్ట్రావైడ్ కెమెరా, 200MP శాంసంగ్ HPE 1/1.4-అంగుళాల OIS టెలిఫోటో రియర్ ఆప్టిక్స్ (8K 30 ఎఫ్‌పీఎస్ వరకు రికార్డింగ్‌కు సపోర్ట్‌తో) 50MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి.