Xiaomi TV A Pro e Series : సినిమాలు, గేమింగ్‌కు అదిరిపోయే టీవీలు.. 85 అంగుళాల భారీ స్క్రీన్‌తో షావోమీ QLED టీవీలు..

Xiaomi TV A Pro e Series : షావోమీ టీవీ ఏ ప్రో ఇ సిరీస్ గ్లోబల్‌గా లాంచ్ అయింది. 32 నుంచి 85 అంగుళాల క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలు, 120Hz గేమ్ మోడ్, గూగుల్ టీవీ, ఎయిర్ ప్లే, 94శాతం డీసీఐ-పీ3 కలర్ కవరేజీ వంటి ఫీచర్లతో వస్తుంది..

Xiaomi TV A Pro e Series

  • 120Hz రిఫ్రెష్ రేట్‌తో షావోమీ కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్
  • షావోమీ కొత్త సిరీస్‌లో స్పెషల్ ఫీచర్లు ఇవే
  • 120Hz గేమ్ మోడ్, గూగుల్ టీవీ సహా అదిరిపోయే ఫీచర్లు

Xiaomi TV A Pro e Series : స్మార్ట్ టీవీ మార్కెట్‌లో షావోమీ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయింది.. గ్లోబల్ మార్కెట్‌లో షావోమీ టీవీ ఎ ప్రో ఇ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. 32 అంగుళాల నుంచి ఏకంగా 85 అంగుళాల వరకు వివిధ స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలను తీసుకొచ్చింది. ముఖ్యంగా క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్పెషల్ గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ కొత్త టీవీల స్పెషాలిటి ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

షావోమీ టీవీ ఎ ప్రో ఇ సిరీస్ గ్లోబల్ లాంచ్ :
ఈ షావోమీ ప్రో (ఇ) సిరీస్‌ను కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో అధికారికంగా లిస్ట్ చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ టీవీల ధరలు, సేల్ తేదీలను వెల్లడించలేదు. ఈ సిరీస్‌లో 32, 43, 55, 65, 75, 85 అంగుళాల స్క్రీన్ సైజుల ఆప్షన్లు ఉన్నాయి.

Read Also : Lava Smartphone Prices : లావా ఫోన్ల ధరలకు రెక్కలు.. నవంబర్ 15 నుంచి భారీగా పెంపు.. రూ.3వేల వరకు బాదుడు! 

అదిరిపోయే డిస్‌ప్లే, స్మార్ట్ ఫీచర్లు :
ఈ సిరీస్‌లోని టీవీల్లో క్యూఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు. 94 శాతం డీసీఐ-పీ3 కలర్ స్పేస్ కవరేజీతో వస్తాయి. నేచురల్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.. ఈ టీవీలు గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి.

గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ ఎయిర్ ప్లే, గూగుల్ క్యాస్ట్ కూడా సపోర్ట్ ఉంది. రిమోట్‌లో వాయిస్ కమాండ్ ఫీచర్‌తో పాటు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌కు స్పెషల్ షార్ట్‌కట్ బటన్లు ఉన్నాయి.

గేమర్ల కోసం స్పెషల్ 120Hz మోడ్ :
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. క్వాడ్‌కోర్ ఏఆర్ఎమ్ కార్టెక్స్-ఎ55 ప్రాసెసర్, Mali-G52 2EE ఎంసీఐ జీపీయూను అందించారు. 32, 43 అంగుళాల మోడళ్లలో 4K రిజల్యూషన్‌తో 60Hz ప్యానెల్ ఉంటుంది. 55, 65, 75, 85 అంగుళాల మోడళ్లలో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ లభిస్తుంది. HDMI ద్వారా స్పెషల్ గేమ్ బూస్ట్ మోడ్ కూడా ఉంది. గేమింగ్ ఎక్స్ పీరియన్స్ మరింత బాగుంటుంది.

సౌండ్ క్లారిటీ అదుర్స్ :
ఆడియో కోసం సాధారణ మోడళ్లలో 10W స్పీకర్లను అందించారు. అయితే, టాప్ మోడల్ షావోమీ టీవీ ఎ ప్రో 85eలో 15W స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. మొత్తంగా పెద్ద స్క్రీన్, QLED విజువల్స్, గూగుల్ టీవీ, గేమింగ్ ఫీచర్లతో షావోమీ కొత్త సిరీస్ ఆకట్టుకుంటోంది.