Xiaomi Washing Machine : వావ్.. AI అసిస్టెంట్‌తో బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

Xiaomi Washing Machine : మిజియా వాషింగ్ మెషీన్ ప్రో అత్యాధునిక సూపర్ ఎలక్ట్రోలైసిస్ టెక్నాలజీతో వచ్చింది. ఈ వాషింగ్ మిషన్ ఫీచర్లు, ధరకు సంబంధించి ఓసారి లుక్కేయండి..

Xiaomi Washing Machine

  • ఈ వాషింగ్ మిషన్ 99.99శాతం బట్టలను క్లీన్ చేయగలదు
  • వాష్ మోడ్‌లలో 36 నిమిషాల క్విక్ వాష్ కూడా ఉంది
  • మిజియా వాషింగ్ మెషీన్ ప్రోలో ఏఐ అసిస్టెంట్ కూడా

Xiaomi Washing Machine : కొత్త వాషింగ్ మిషన్ కొనేందుకు చూస్తున్నారా? షావోమీ కొత్త మిజియా వాషింగ్ మిషన్ ప్రో వచ్చేసింది. ఈ వాషింగ్ మెషీన్‌లో కంపెనీ సూపర్ ఎలక్ట్రోలైసిస్ టెక్నాలజీ ఉంది. డైమండ్ లేయర్ ఎలక్ట్రోడ్‌లతో నీటిని చాలా ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది. యాక్టివ్ ఆక్సిజన్ లెవల్స్ పెంచి బట్టలను అద్భుతంగా క్లీన్ చేస్తుందని చెబుతున్నారు.

20 రకాల మరకలపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కంపెనీ ప్రకారం.. 99.99శాతం సమయం (Xiaomi Washing Machine) ఆటోమేటిక్‌గా క్లీన్ చేయగలదు. బ్యాక్టీరియా పెరగకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. క్విక్ వాష్ ఫీచర్‌తో సహా అనేక స్పెషల్ ఫంక్షన్‌లను అందిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వాషింగ్ మెషీన్ ప్రో ధర ఎంతంటే? :
షావోమీ కొత్త 10 కేజీల వాషింగ్ మెషీన్‌ను చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ వాషింగ్ మెషీన్ ధర 2,699 యువాన్లు (సుమారు రూ. 38వేలు). కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ వాషింగ్ మిషన్ కొనేసుకోవచ్చు. ఐటీహోమ్ ప్రకారం.. షావోమీ కంపెనీ ఈ మెషీన్‌లోని డీడీ డైరెక్ట్-డ్రైవ్ మోటార్‌పై 10 ఏళ్ల వారంటీ, మొత్తం యూనిట్‌పై 3 ఏళ్ల కవరేజీని అందిస్తోంది.

మిజియా వాషింగ్ మెషీన్ ప్రో ఫీచర్లు :
షావోమీ మిజియా వాషింగ్ మెషీన్ ప్రో అనేది కంపెనీ సరికొత్త మోడల్. సూపర్ ఎలక్ట్రోలైసిస్ టెక్నాలజీతో వస్తుంది. డైమండ్ లేయర్ ఎలక్ట్రోడ్‌లతో నీటిలో యాక్టివ్ ఆక్సిజన్ లెవల్స్ 15 రెట్లు పెంచుతుంది.

Read Also : Samsung Galaxy M67 : కొత్త శాంసంగ్ ఫోన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఈ ఫోన్ ఎంత స్పెషల్ అంటే..!

తద్వారా బట్టల లోపల నుంచి మురికి, బ్యాక్టీరియాను నేచురల్‌గా తొలగిస్తుంది. సోయా సాస్, జ్యూస్, బ్లడ్ వంటి 20 రకాల మొండి మరకలను క్లీన్ చేయగలదు. ఎల్లో కలర్ ఆప్షన్లలో తెల్లని బట్టలను కూడా తెల్లగా మార్చగలదు. రంగులు వెలిసిపోకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.

10కిలోగ్రాముల బరువుతో మిజియా వాషింగ్ మెషీన్ ప్రో క్లీనింగ్ విషయంలో కూడా అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. ఈ మెషీన్ 99.99శాతం వరకు ఆటోమాటిక్ క్లీనింగ్ చేయగలదు. హై టెంపరేచర్ స్టీమ్ ద్వారా 99.99శాతం వరకు బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయగలదు.

ఈ మెషీన్ అవసరమైన డిటర్జెంట్, సాఫ్ట్‌నర్ సైజును కూడా ఆటోమాటిక్‌గా సెట్ చేస్తుంది. వాష్ మోడ్‌లలో 36 నిమిషాల క్విక్ వాష్, 12 నిమిషాల ఎక్స్‌ప్రెస్ సైకిల్, డౌన్ జాకెట్‌ల కోసం స్పెషల్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఉన్ని, పెంపుడు జంతువుల వెంట్రుకలను తొలగించే స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంది.

మిజియా వాషింగ్ మెషీన్ ప్రోలో ఏఐ అసిస్టెంట్ కూడా ఉంది. ఆఫ్-పీక్ ఎనర్జీ షెడ్యూలింగ్ ఆప్షన్లతో పనిచేస్తుంది. Mi హోమ్ యాప్ లేదా షావోమీ స్పీకర్ ద్వారా రిమోట్ కంట్రోల్‌తో కూడా వస్తుంది.