Yamaha R2 Launch : యమహా నుంచి ఫస్ట్ 204cc సూపర్‌స్పోర్ట్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

Yamaha R2 Launch : యమహా కొత్త YZF-R2 సూపర్‌స్పోర్ట్ బైక్‌ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.30 లక్షలు (ఢిల్లీ). 200cc సెగ్మెంట్‌లో యమహా నుంచి ఇదే ఫస్ట్ బైక్. డెలివరీలు ఎప్పటినుంచంటే?

Yamaha R2 Launch

  • యమహా నుంచి సరికొత్త YZF-R2 బైకు వచ్చేసింది
  • ఈ కొత్త బైకులో 204cc ఇంజన్, స్పోర్టీ డిజైన్ అదుర్స్
  • ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.30 లక్షలు

Yamaha R2 Launch : స్పోర్ట్స్ బైక్ ప్రియుల కోసం యమహా కొత్త బైకు వచ్చేసింది. ఈ కంపెనీ కొత్త YZF-R2 సూపర్‌స్పోర్ట్ బైకును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెగ్మెంట్‌లో యమహా నుంచి ఫస్ట్ మోటార్‌సైకిల్ ఇదే. ఈ బైక్‌లో కొత్త 204cc ఇంజన్, స్పోర్టీ డిజైన్, అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.30 లక్షలుగా ఉంటుంది.

3 వేరియంట్లలో లాంచ్ :
కొత్త యమహా YZF-R2 బైక్ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 2.30 లక్షలు ఉంటుంది. యమహా YZF-R2 క్విక్ షిఫ్టర్ ధర (Yamaha R2 Launch) రూ. 2.39 లక్షలు, టాప్-ఆఫ్-ది-లైన్ YZF-R2 M ధర రూ. 2.53 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ బైకు డెలివరీలు 2026 సెప్టెంబర్ మధ్యలో ప్రారంభం కానున్నాయి.

204cc ఇంజన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ :
యమహా YZF-R2 కొత్త 204cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్ DOHC పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 26.5 PS పవర్, 19.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు వస్తుంది. మిడ్- టాప్-స్పెక్ వేరియంట్లలో థర్డ్ జనరేషన్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది. గేర్ ఫాస్ట్ ఛేంజ్ చేయొచ్చు.

Read Also : Samsung Galaxy Quantum 7 : కొత్త శాంసంగ్ ఫోన్ అదరహో.. 50MP ట్రిపుల్ కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ధర జస్ట్..!

స్పోర్టీ డిజైన్, స్ట్రాంగ్ ఛాసిస్ :
ఈ బైక్ డిజైన్ యమహా R-సిరీస్ నుంచి వచ్చింది. R9, R1 పోలిన స్టైలింగ్‌ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ బై-ఫంక్షనల్ LED హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పొజిషన్ లైట్లు ఉన్నాయి. రియర్ సైడ్ బ్లాక్-స్టైల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ అందిస్తుంది. ఈ బైక్ బరువు 149 కేజీలు. ఇందులో 37mm USD ఫ్రంట్ ఫోర్క్‌లు, రియర్ సైడ్ మోనోషాక్ ఉన్నాయి. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ స్పోర్టీ డిజైన్ మరింత అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

సేఫ్టీలోనూ ఫుల్ ఫీచర్లు :
యమహా అన్ని వేరియంట్లలో డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యమహా రైడ్ కంట్రోల్‌ను స్టాండర్డ్‌గా అందించింది. స్ట్రీట్, స్పోర్ట్, రెయిన్ అనే 3 రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది.

5-అంగుళాల TFT డిస్‌ప్లే :
ఈ బైక్‌లో రైడింగ్, నావిగేషన్ డేటా కోసం 5-అంగుళాల ఫుల్-కలర్ TFT డిస్‌ప్లే ఉంది. టాప్-స్పెక్ YZF-R2 Mలో స్మార్ట్ కీ, అడ్జెస్ట్ ఫ్రంట్ ఫోర్కులు, రియర్ షాక్ అబ్జార్బర్లు, క్లచ్, బ్రేక్ లివర్ల వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.