MacBook Neo : పండగ చేస్కోండి.. ఈ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్ చాలా చీప్ గురూ.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!
Apple MacBook Neo : ఆపిల్ కొత్త మ్యాక్ ల్యాప్‌టాప్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర రూ. 69,900 నుంచి భారీ తగ్గింపుతో ఇప్పుడు కేవలం రూ. 50వేల లోపు ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ అసలు వదులుకోవద్దు.
- Sreehari A
- Published on- May 25, 2026 / 11:40 AM IST
Apple MacBook Neo
- రూ. 50వేల లోపు ధరకే కొత్త మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్
- అమెజాన్‌లో డైరెక్ట్ 7 శాతం డిస్కౌంట్‌తో కొనేసుకోవచ్చు
- అసలు ధర రూ. 69,900 నుంచి భారీ తగ్గింపు ఆఫర్లు
MacBook Neo : ఆపిల్ లవర్స్‌కు అద్భుతమైన ఆఫర్.. మార్కెట్లోకి కొత్త ఆపిల్ మ్యాక్ ల్యాప్‌టాప్ వచ్చేసింది. అది కూడా సరసమైన ధరలో లభిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఆపిల్ మ్యాక్‌బుక్ నియో లాంచ్ కాగా టెక్ విమర్శకులను సైతం ఆకట్టుకుంది.
మల్టీ టాస్కింగ్ కోసం ఈ నియో డివైజ్ అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఈ మ్యాక్‌బుక్ నియో (MacBook Neo) ధర రూ. 69,900 ఉండగా ఇప్పుడు కేవలం రూ. 50వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో మ్యాక్‌బుక్ నియో డిస్కౌంట్ :
అమెజాన్ ప్లాట్‌ఫారంలో ఈ ల్యాప్‌టాప్ డైరెక్ట్ 7 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. అసలు ధర నుంచి రూ. 65వేలకు తగ్గింది. అంతేకాదు.. ఎస్బీఐ, యాక్సెస్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ. 4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో రూ 61వేలకు తగ్గుతుంది.
ఒకవేళ మీ దగ్గర పాత ల్యాప్ టాప్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.13,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, మీ పాత ల్యాప్ టాప్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఫైనల్ రేట్ వాల్యూ ఉంటుంది. ఫైనల్ గా మ్యాక్ బుక్ నియో రూ. 47,500 తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు.
మ్యాక్ బుక్ నియో స్పెషిఫికేషన్లు :
ఈ మ్యాక్‌బుక్ నియో 2408×1506 రెజ్యూలషన్‌తో 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ ఎ18 ప్రో చిప్ కూడా ఉంది. ఐఫోన్ 16 ప్రోలో కూడా ఇదే చిప్ ఉంది. ఇందులో 1080p ఫేస్ టైమ్ హెచ్ డీ కెమెరా కూడా ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్లతో ఆడియో, డాల్ బై ఆట్మోస్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ల్యాప్ టాప్ బ్యాటరీ లైఫ్ సింగిల్ ఛార్జ్‌తో 16 గంటలు వస్తుంది.
కనెక్టవిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. రెండు యూఎస్ బీ సి పోర్టులు, ఒక హెడ్ ఫోన్ జాక్, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 6 ఉన్నాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పాటు మ్యాక్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. మొత్తానికి ఆపిల్ లవర్స్ అత్యంత సరసమైన ధరకే ఈ మ్యాక్ బుక్ నియో ల్యాప్ టాప్ కొనేసుకోవచ్చు.
