Apple iPhone Prices : ఆపిల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..! ఐఫోన్ కొనడం ఇక అంత ఈజీ కాదు.. టిమ్ కుక్ సంచలన కామెంట్స్!

Apple iPhone Prices : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు భారీ షాక్.. ఇకపై ఐఫోన్లు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. మెమెరీ, స్టోరేజీ చిప్ కొరత కారణంగా ఐఫోన్ల ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు.

Apple iPhone Prices

  • భారీగా పెరగబోతున్న ఆపిల్ ఐఫోన్ ధరలు
  • ఏఐ ఆధారిత డిమాండ్ కారణంగా పెంపు అనివార్యం
  • ఐఫోన్ 18 సిరీస్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం
  • వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఇంటర్వ్యూలో సీఈఓ టిమ్ కుక్ వెల్లడి

Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు బిగ్ షాకింగ్ న్యూస్.. అతి త్వరలో ఐఫోన్ ధరలు అమాంతం పెరగబోతున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. ఐఫోన్ ధరలు పెరగడానికి కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ పెరుగుతున్న మెమరీ స్టోరేజ్, చిప్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఆపిల్ ప్రొడక్టుల ధరలను భారీగా పెంచాలని యోచిస్తోందని సీఈఓ టిమ్ కుక్ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

డేటా సెంటర్లకు ఏఐ-ఆధారిత డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో స్పేర్ పార్టుల సరఫరాకు భారీ కొరత ఏర్పడింది. దాంతో కన్స్యూమర్ (Apple iPhone Prices) ఎలక్ట్రానిక్స్ కంపెనీలు స్పేర్ పార్టుల కోసం పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ల ధరలు అమాంతం పెరిగాయి.

మరోవైపు.. ఆటోమొబైల్ తయారీదారులు, రిటైలర్లు, ఎలక్ట్రానిక్ సంస్థలు, ప్రాతినిధ్య బృందాలు, మెమరీ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా అమెరికా వినియోగ వస్తువుల ధరలలో భారీ పెరుగుదలతో పాటు సరఫరా గొలుసులకు తీవ్ర అంతరాయం కలిగించవచ్చని ఈ నెల ప్రారంభంలోనే హెచ్చరించాయి.

ఐఫోన్ ధరల పెంపు అనివార్యమే :
“దురదృష్టవశాత్తు ఆపిల్ ఐఫోన్ ధరల పెంపు అనివార్యం” అని ఆపిల్ సీఈఓ స్పష్టం చేశారు. ‘ఈ భారాన్ని తగ్గించుకునేందుకు తప్పని పరిస్థితుల్లో ఆపిల్ ప్రొడక్టుల ధరలను పెంచక తప్పడం లేదు. మా వైపు నుంచి సాధ్యమైనంతవరకు ధరలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. ఈ పెంపు భారం నుంచి వినియోగదారులను సైతం తప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. కానీ, పరిస్థితి భరించలేనిదిగా మారింది’ అంటూ కుక్ తెలిపారు.

జాన్ టెర్నస్‌కు ఆపిల్ పగ్గాలు :
వచ్చే సెప్టెంబర్‌లో కంపెనీ సీఈఓ బాధ్యతలను జాన్ టెర్నస్‌కు అప్పగించనున్న కుక్.. ఐఫోన్ల ధరలు ఎప్పుడు లేదా ఎంత పెరగవచ్చు? అలాగే ఏ ప్రొడక్టులపై ఎంతవరకు ప్రభావం పడుతుందో మాత్రం వెల్లడించలేదు. రాబోయే ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లతో పాటు, కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతున్నట్టు సమాచారం.

Read Also : Google Pixel 10 Offer : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై ఏకంగా రూ. 18,800 తగ్గింపు.. ఇలా కొన్నారంటే?

మెమరీ స్టోరేజ్ ఖర్చులు రెండూ కంపెనీకి ఆందోళన కలిగించే అంశాలుగా కనిపిస్తున్నాయని సీఈఓ కుక్ అన్నారు. ముఖ్యంగా DRAM మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు జర్నల్‌కు తెలిపారు. ఏఐ సర్వర్‌లలో వాడే హై-బ్యాండ్‌విడ్త్ మెమరీకి ఎక్కువ సరఫరాను కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వినియోగదారులకు ఆపిల్ డివైజ్‌ల అవసరమైన సమయంలో సరఫరా తక్కువగా ఉందన్నారు. ఫలితంగా మెమరీ తయారీదారులు భారీ ధరల పెంపును వినియోగదారులపై మోపుతున్నారని ఆయన చెప్పారు. వినియోగదారుల ప్రొడక్టుల కోసం మెమరీ ధరలు, సరఫరా కచ్చితంగా సాధారణ స్థితికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాని కుక్ చెప్పుకొచ్చారు.

మెమరీ సరఫరాను పెంచుకునేందుకు ఆపిల్ వద్ద క్యాష్ మొత్తాన్ని వినియోగించేందుకు రెడీగా ఉందన్నారు. ఆపిల్ క్యాష్ సిలికాన్ స్కిల్స్ ఉపయోగించి సొంత మెమరీ స్టోరేజ్ ఫ్యాక్టరీలను నిర్మించే ప్లాన్లు ప్రస్తుతానికి ఏవీ లేవని కుక్ స్పష్టం చేశారు.