New Tax Regime Guide : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. రూ. 20 లక్షల జీతంపై జీరో టాక్స్..! కొత్త పన్ను విధానంలో అసలు సీక్రెట్ ఇదే..!
New Tax Regime Guide : కొత్త పన్ను విధానంలో రూ. 20 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మార్చుకోవచ్చు. అన్ని ప్రయోజనాలతో కలిపి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని జీరోకు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
New Tax Regime Guide
- రూ. 20 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మార్చుకోవచ్చు
- కొత్త పన్ను విధానం ఎంచుకున్నా పన్ను ఆదా చేయొచ్చు
- భారీ ఆదాయం పొందే జీతగాళ్లకు జీరో టాక్స్ ఎలా సాధ్యం?
New Tax Regime Guide : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. కొత్త పన్ను విధానం ఎంచుకున్నారా? లేదా పాత పన్ను విధానం ఎంచుకున్నారా? మీరు ఏ పన్ను విధానం ఎంచుకున్నా పన్ను ఆదా ప్రయోజనాలను పొందవచ్చు తెలుసా? చాలామంది కొత్త ఆదాయపు పన్ను విధానంలో మినహాయింపులు లేవని పన్ను ఆదా ఉండదని భావిస్తుంటారు.
వాస్తవానికి కొత్త పన్ను విధానంలో పాత మినహాయింపులు (80C, HRA) తొలగించినప్పటికీ, పూర్తిగా పన్ను ఆదా (New Tax Regime Guide) అవకాశాలు లేవని కాదు.. జీతభత్యాలు పొందే ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్‌గా రూ. 50వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది.
కంపెనీ ఇచ్చే NPS కాంట్రిబ్యూషన్, కొన్ని అలవెన్సులు వంటి ప్రయోజనాలు కొంతమేరకు పన్ను భారాన్ని తగ్గిస్తాయి. కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్ రేట్లు తక్కువగా ఉన్నాయి. దాంతో మొత్తం పన్ను భారం కూడా తగ్గుతుంది. సాధారణంగా రూ. 20 లక్షలు సంపాదించే ఒక వ్యక్తి రూ. లక్ష కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది.
అయితే, వాస్తవం కొంత భిన్నంగా ఉంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే.. కొత్త విధానంలో కూడా పన్ను ఆదాకు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలను సరిగ్గా వాడుకుంటే పన్ను విధించదగిన ఆదాయాన్ని భారీగా తగ్గించవచ్చు. జీరో కూడా తెచ్చుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కొత్త పన్ను విధానంలో ఏం మారింది? :
పాత పన్ను విధానంలో 80C వంటి సెక్షన్ల కింద పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు. అయితే, కొత్త పన్నువిధానం మీ జీతం నిర్మాణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే.. ఎంత పెట్టుబడి పెడతారనే దానికన్నా మీ CTC ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం.
ఉదాహరణకు, మీ CTC రూ.20 లక్షలు ఉండి అందులో రూ.10 లక్షలు బేసిక్ ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో దానికి స్పెషల్ టాక్స్ సేవింగ్ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. ఈ విధానం సింపుల్ స్లాబ్ ఆధారితంగా పన్ను లెక్కిస్తారు.
డిడక్షన్లు ఎలాగంటే? :
ముందుగా, మీల్ బెనిఫిట్ పొందవచ్చు. రోజుకు రెండుసార్లు, ఒక్కో భోజనానికి రూ. 200 చొప్పున, 22 వర్కింగ్ డేస్ చెల్లిస్తే.. ఏడాదికి సుమారు రూ. 1.05 లక్షలు పన్ను ఆదా చేయొచ్చు. ఆ తర్వాత కంపెనీ చెల్లించే ఈపీఎఫ్ వాటా వస్తుంది. కనీస వేతనంలో 12 శాతం ఉంటుంది.
Read Also : RBI New Rules : పాత రూ. 500 రూ. 1000 నోట్లు మళ్లీ మార్చుకోవచ్చా? RBI కొత్త రూల్స్ ఇవేనా? అసలు నిజం ఇదే..!
సుమారుగా రూ. 1.2 లక్షల తగ్గింపు లభిస్తుంది. అదనంగా, సెక్షన్ 80CCD(2) కింద NPSకు కంపెనీ చెల్లించే వాటాలు ప్రాథమిక వాటాలో 14శాతం వరకు, సుమారు రూ. 1.4 లక్షల అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈ మొత్తాలను విడివిడిగా చూస్తే చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ అన్నీ కలిపితే భారీ మొత్తంలో పన్ను ఆదా అవుతుంది.
కారు లీజింగ్ అతిపెద్ద బెనిఫిట్ :
కారు లీజులతో భారీ మొత్తంలో పన్ను ఆదా చేయొచ్చు. ఒక ఉద్యోగి రూ. 8 లక్షల విలువైన కారును రెండేళ్లకు లీజుకు తీసుకుంటే.. వార్షిక ఖర్చు (వడ్డీతో సహా) సుమారుగా రూ. 4.23 లక్షలు అవుతుంది. ఈ ఖర్చును జీతంతో లెక్కిస్తే భారీగా పన్ను ఆదా అవుతుంది.
కారు లీజుతో మొత్తం డిడక్షన్ సుమారు రూ. 7.88 లక్షలకు చేరుతుంది. కేవలం రూ. 3.65 లక్షలకు వస్తుంది. మీకు కారు ఉంటే ఫ్యూయిల్, డ్రైవర్ ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం లాగ్‌బుక్ మెయింటైన్ చేయడం బెటర్.
ఎంత పన్ను చెల్లించాలి? :
క్లియర్‌టాక్స్ ప్రకారం.. ఈ డిడక్షన్లు అన్నీ తీసివేసిన తర్వాత నికర జీతం సుమారు రూ. 12.11 లక్షలకు తగ్గుతుంది. రూ. 75వేలు స్టాండర్డ్ డిడక్షన్ అప్లయ్ చేశాక పన్ను విధించదగిన ఆదాయం సుమారు రూ. 11.36 లక్షలకు తగ్గుతుంది.
కొత్త పన్ను విధానంలో లభించే రాయితీ పన్ను బాధ్యత దాదాపు జీరో అవుతుంది. అయితే, కార్ లీజు ఆప్షన్ తీసుకోకపోతే పన్ను విధించదగిన ఆదాయం సుమారు రూ. 15.59 లక్షలుగా ఉంటుంది. దీనిపై సుమారు రూ. 1.18 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
జీతగాళ్లు ఇవి తప్పక తెలుసుకోండి :
కొత్త పన్ను విధానంలో సాంప్రదాయ డిడక్షన్ తగ్గినప్పటికీ కంపెనీ నుంచి పొందే ఇతర ఆదాయం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు పన్ను ప్రణాళిక అంటే.. చివరి నిమిషంలో పెట్టుబడులు పెట్టడం కాదు.. మీ జీతం నిర్మాణాన్ని తెలివిగా సెట్ చేసుకోవడం అనమాట.
మీ కనీస వేతనానికి సంబంధించిన చెల్లింపులు, కార్ లీజుల వంటి ఆప్షన్లు చాలా కీలకం. రూ. 20 లక్షల జీతం ఉన్నంత మాత్రాన మీరు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని కాదు. కానీ, సరైన ప్లానింగ్ లేకుంటే ఎక్కువ పన్ను చెల్లించకతప్పదు.
క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు సీఈఓ అర్చిత్ గుప్తా ప్రకారం.. రూ. 20 లక్షల వరకు సంపాదించే వారు కార్ లీజ్ ఆప్షన్ ఎంచుకుంటే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని జీరోకు తగ్గించుకోవచ్చు. దాంతో మొత్తం CTCలో సుమారు 6 శాతం పన్ను ఆదా అవుతుంది. కంపెనీపై ఎలాంటి అదనపు భారం పడదు. అలాగే చేతికి అందే జీతం కూడా భారీగా పెరుగుతుంది.
