Eluru B Pharmacy Student : ఏలూరు బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసు.. ఆ ఇద్దరి బెదిరింపుల వల్లే దారుణం
Eluru B Pharmacy Student : బీ ఫార్మసీ విద్యార్థిని సువర్షిణి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
- Dharani Pilli
- Published On : April 1, 2026 / 11:52 AM IST
eluru b pharmacy student case latest update police arrest two students
Eluru B Pharmacy Student : వారం రోజుల క్రితం ఏలూరులో బీ ఫార్మసీ విద్యార్థిని ఒకరు హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏలూరులోని సర్ సి.ఆర్. రెడ్డి ఫార్మసీ కాలేజ్‌లో బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న సువర్షిణి అనే విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెను విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కన్నవాళ్లు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న సువర్షిణి ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొదట ఆమెది సాధారణ ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత సువర్షిణి మృతిని ప్రేరేపిత ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. ఆమె క్లాస్‌మేట్స్ రటాలు, విజయసారధి అనే విద్యార్థుల వేధింపుల వల్లే సువర్షిణి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. సువర్షిణి ప్రైవేట్ చాట్ బయటపెడతామని వారు బెదిరించడంతో.. మనస్తాపానికి గురైన సువర్షిణి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ కేసులో త్రీటౌన్ పోలీసులు ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
