ఉద్యోగం కోసం కన్న తండ్రిని చంపిన కిరాతకుడు

  • Publish Date - November 22, 2020 / 07:50 PM IST

Unemployed son kills father :  కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కొన్ని విభాగాల్లో ఉన్న కారుణ్య నిమాయకం ఒక వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది.ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కిరాతకపు కొడుకు. జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గర్ జిల్లాలోని బర్కనాక లో కృష్ణారామ్ (55) అనే వ్య‌క్తి సెంట్ర‌ల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌(సీసీఎల్‌) లో సెక్యురిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. గత గురువారం రాత్రి అనుమానాస్పద రీతిలో కృష్ణారామ్‌ మరణించాడు. గుర్తు తెలియన వ్యక్తి గొంతు కోసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు…. కృష్ణారామ్ పెద్ద కొడుకు (35) హ‌త్య‌చేసిన‌ట్లుగా క‌నుగొన్నారు.

చిన్న క‌త్తితో క్వార్ట‌ర్స్‌లోనే తండ్రి గొంతుకోసి చంపిన‌ట్లుగా నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎల్ లీగ‌ల్ విభాగం ప్ర‌కారం ఓ ఉద్యోగి తన సర్వీసు కాలంలో మరణిస్తే.. కారుణ్య కోటా కింద అతని కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. నిరుద్యోగి అయిన కొడుకు…..‌ కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకు తండ్రిని హ‌త‌మార్చిన‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు.