Nurse Killed Husband : ప్రియుడి కోసం నర్స్ సాహసం.. వామ్మో ఏకంగా జేసీబీని రంగంలోకి దింపింది..
Nurse Killed Husband : తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ నర్స్ కంత్రీ ప్లాన్ వేసింది. కానీ చివరకు
- Dharani Pilli
- Updated on- May 24, 2026 / 04:42 PM IST
Narayankhed nurse kills her husband for illicit relation
- నారాయణఖేడ్‍లో దారుణం
- వివాహేతర సంబంధం కోసం
- భర్తను హత్య చేసిన నర్స్ కల్పన
Nurse Killed Husband : వివాహేతర సంబంధాల వ్యామోహంలో పడి సభ్య సమాజం తలదించుకునే దారుణాలకు ఒడిగడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆడవారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటం గమనార్హం. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన వారిని కూడా కడతేర్చడానికి వెనకాడటం లేదు. ఈ క్రమంలో తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం భర్తను కడతేర్చడానికి సిద్ధమైన ఓ నర్స్.. పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ ప్లాన్ వేసింది. ఏకంగా జేసీబీని రంగంలోకి దించి కథ నడిపించింది. ఆ వివరాలు..
వివాహేతర బంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో అతడిని చంపేయాలని భావించిన ఓ నర్స్, తన ప్రియుడితో కలిసి హత్య చేసి ఆపై జేసీబీ సాయంతో పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి అనే వ్యక్తికి కల్పన అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది.
కల్పన నారాయణఖేడ్‍లో ఉన్న ఓ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తోంది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. హాయిగా సాగిపోతున్న వీరి జీవితంలో మూడో వ్యక్తి రాకతో కలతలు మొదలయ్యాయి. చివరకు అవి ముత్యం రెడ్డి ప్రాణాలను బలి తీసుకున్నాయి. కొన్నాళ్ల క్రితం కల్పనకు చింటూ అనే మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వీరి అక్రమ సంబంధం గురించి ముత్యం రెడ్డికి తెలిసింది. దీంతో ఆయన కల్పన, చింటులను హెచ్చరించాడు. అయినా వారు తీరు మార్చుకోలేదు. పైగా ముత్యం రెడ్డి తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన, తన ప్రియుడితో కలిసి ముత్యం రెడ్డి హత్యకు ఒక కుట్రపూరిత ప్లాన్ వేసింది.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కల్పన తన ప్రియుడు చింటూతో కలిసి భర్త ముత్యం రెడ్డిని హత్య చేసింది. ఆ తర్వాత కల్పన తన భర్త మృతదేహాన్ని గ్రామ శివారులో జేసీబీ సాయంతో గొయ్యి తీయించి అందులో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లుగా నటించి, తన భర్త ముత్యం రెడ్డి కనిపించడం లేదని అందరికీ చెప్పింది. భర్త మిస్ అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు కల్పనపై అనుమానం కలిగింది.
ఎవరు చంపారు? ఎందుకు చంపారు? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పవన్ సజీవదహనం కేసులో ఎన్నో అనుమానాలు
ఈ క్రమంలో పోలీసులు ఆ దిశగా విచారించగా కల్పన ఆడిన నాటకం బట్టబయలైంది. ముత్యం రెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టిన 9 రోజుల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. చివరకు పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు.
