Karimnagar SI : దారుణం.. గన్నేరు పప్పు దంచుకుని తిని SI భార్య ఆత్మహత్య
Karimnagar SI : కరీంగనర్ లో దారుణం చోటు చేసుకుంది. ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకుంది.
- Dharani Pilli
- Published On : March 18, 2026 / 04:46 PM IST
tragic incident in telangana Karimnagar si Wife ends her life
Karimnagar SI : కరీంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎస్సై భార్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ టూ టౌన్‌లో ఎస్సైగా పని చేస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్నారు. గన్నేరుపప్పు దంచుకుని తిని తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను చికిత్స నిమిత్తం వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు తమ వల్ల కాదనడంతో హైదరాబాద్ తరలించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెను చేర్పించి చికిత్స అందిస్తుండగా.. మధ్యలోనే ప్రాణాలు విడిచారు.
దివ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పిల్లలిద్దరూ ఏడేళ్లలోపు వారే కావడంతో.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత దివ్య మృతదేహాన్ని స్వగ్రామం సీతంపేటకు తరలిస్తారు.
అయితే దివ్య ఆత్మహత్యకు ఎస్సై చంద్రశేఖర్ వేధింపులే కారణమంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గొడవ జరుగుతుందని భావించిన ఎస్సై చంద్రశేఖర్ సన్నిహితులు ఆయనను ఓ ఇంట్లో పెట్టి తాళం వేశారు. అయితే దివ్య బంధువులు దాడి చేసే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు ఇంటి వెనకాల నుండి గోడ దూకించి తప్పించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. చంద్రశేఖర్ పరారీ అవుతుండగా దివ్య తరఫు బంధువులు అతడిని వెంబడించారు.
