ట్యాంక్ బండ్ పై యువకుడిని చితక బాదిన హిజ్రాలు

  • Publish Date - September 5, 2020 / 07:06 AM IST

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై హిజ్రాలు ఇటీవల ఒక యువకుడిని చితక బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



సెప్టెంబర్1న జరిగిన గణేష్ నిమజ్జనం తిలకించేందుకు వచ్చిన ట్రాన్స్ జెండర్స్ తో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విసుగు చెందిన హిజ్రాలు గుంపుగా ఆ వ్యక్తిని చితక బాదారు. ఈ క్రమంలో వారినుంచి తప్పించుకుని ఆయువకుడు పారిపోయాడు.
https://10tv.in/singer-noel-confirms-divorce-with-wife-ester/
కొంత దూరం తరిమినప్పటికీ మళ్లీ వారి చేతికి చిక్కలేదు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు.