Man rapes female dog : ఆడ కుక్కపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
- murthy
- Published On : April 5, 2021 / 08:33 PM IST
Man Rapes Female Dog
65 Years Old Pune Man rapes female dog for months, held after act caught on CCTV : మహిళలు, యువతుల పై లైంగిక దాడి జరిగిన ఘటనలు రోజు దేశంలో ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాము. కానీ మహారాష్ట్రలోని ఒక వ్యక్తి గత కొన్నాళ్లుగా కుక్కపై లైంగిక దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.
పూణేలోని చతుశ్రుంగి పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే 65 ఏళ్ల వ్యక్తి…. ఆ ప్రాంతంలో ఉన్న ఆడ కుక్కపై గతేడాది అక్టోబర్ నుంచి లైంగిక దాడి చేస్తున్నాడు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి సాక్ష్యాలతో సహా ఆవ్యక్తిని అరెస్ట్ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. జంతు సంరక్షణకోసం పోరాడుతున్న స్ధానిక స్వఛ్చంద పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఆవ్యక్తిని అరెస్ట్ చేశారు.
పూణే లోని మోడల్ కాలనీలో నివసించే వ్యక్తి(65) కొన్నాళ్లుగా కుక్కపై లైంగిక దాడి చేస్తున్నట్లు స్ధానిక యువకులు గమనించారు. ఈ విషయాన్ని జంతు సంరక్షణ చూసే స్ధానిక స్వచ్చంద సంస్ధకు తెలిపారు. యువకులు చెప్పిన విషయానికి సాక్ష్యాలు కావాలి కనుక ఆప్రాంతంలో సీసీటీవీ ఫుటేజి కోసం ప్రయత్నించారు.
అక్కడ సీసీ కెమెరాలు లేకపోవటంతో ఎన్జీవో గతేడాది అక్కడ సీసీ కెమెరాలను అమర్చింది. ఇదంతా ఆ వ్యక్తి గమనించలేదు. కెమెరాలు అమర్చిన మూడు రోజల తర్వాత రాత్రి పూట మెల్లగా నడుచుకుంటూ కుక్క దగ్గరకు వచ్చాడు.
తనని ఎవరూ గమనించటంలేదని ముందు వెనుకలు చూసుకుంటూ అక్కడకు వచ్చాడు. కుక్క పక్కన కూర్చుని దాన్ని ప్రేమగా నిమిరాడు. మళ్లీ, ఎవరూ తనను గమనించటంలేదనుకున్న తర్వాత….. కుక్కను ఎత్తుకుని దగ్గరలోని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లాడు.
అక్కడ దానిపై లైంగిక దాడి చేశాడు. అలా కొన్నాళ్లు చేయనిచ్చిన స్వఛ్చంద సంస్ధ, తగిన ఆధారాలు లభించగానే ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 377 కింద కేసునమోదు చేశారు. వీడియో ఫుటేజి, ఫోటోల ఆధారంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు. కుక్కను స్వఛ్చంద సంస్ధ సంరక్షణకు పంపారు.
