IPL Betting : ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.కోటికిపైగా కోల్పోయిన భర్త.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య!

IPL Betting : ఐపీఎల్ బెట్టింగ్‌ల్లో కోట్లు పెట్టి భర్త అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన కర్ణాటకలో జరిగింది.

IPL Betting : ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ మొదలుకాగానే బెట్టింగ్‌రాయుళ్ల నుంచి బెట్టింగ్‌లతో వేల కోట్లు చేతులు మారిపోతుంటాయి. ఈ బెట్టింగ్స్ కారణంగా లాభాలు పొందేవారికన్నా డబ్బులు పొగొట్టుకునే వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. బెట్టింగ్ కోసం అప్పులు చేస్తుంటారు. చేసిన అప్పులు తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది ఐపీఎల్ బెట్టింగ్ మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Read Also : ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌కి సర్వం సిద్ధం.. భారీ బందోస్తు.. వీటిని అనుమతించరు..

వారితో పాటు తమ కుటుంబాలను కూడా రోడ్డునపడేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో వెలుగుచూసింది. భర్త బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులను తీర్చలేక అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మార్చి 18న కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ప్రకారం.. దర్శన్ అనే వ్యక్తి ఐపీఎల్ బెట్టింగ్ కోసం రూ. కోటికి పైగా అప్పులు చేశాడు. అప్పుల వాళ్ల వేధింపులు భరించలేని అతడి భార్య రంజిత తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఐపీఎల్ బెట్టింగ్‌ల కోసం రూ.కోటికిపైగా అప్పు :
పోలీసుల కథనం ప్రకారం.. దర్శన్ బాబు హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. అతడికి క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లంటే పిచ్చి. దర్శన్‌ను 2020లో రంజిత వివాహం చేసుకుంది. దర్శన్, రంజిత దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. 2021 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గేమ్‌లపై భారీ బెట్టింగ్‌లు వేస్తున్నాడు. అతను బెట్టింగ్‌లో ఓడిపోయిన ప్రతిసారి డబ్బుల కోసం అందరి దగ్గర అప్పులు చేస్తూ వచ్చాడు. ఇలా ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా రూ.కోటి వరకు అప్పులు చేశాడు. కానీ, గడువు సమయానికి చెల్లించలేకపోయాడు.

ఇప్పడు ఆ అప్పులు ఇచ్చినవారంతా కుటుంబాన్ని నిత్యం వేధించడం మొదలుపెట్టారు. రుణదాతల వేధింపులతో విసిగిపోయిన అతని 23 ఏళ్ల భార్య రంజిత ఆత్మహత్యకు పాల్పడింది. మార్చి 18న కర్ణాటకలోని చిత్రదుర్గలోని తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. అయితే, 2021 నుంచి 2023 వరకు దర్శన్ ఐపీఎల్ బెట్టింగ్‌లు కడుతూనే ఉన్నాడు. ఈజీ మనీ కోసం కోట్ల డబ్బును బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. రూ. 1.5 కోట్లకు పైగా రుణం తీసుకున్న దర్శన్.. రూ. 1 కోటి తిరిగి ఇచ్చాడు. ఇంకా రూ. 84 లక్షల అప్పు పెండింగ్‌లోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.

రంజిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు :
దర్శన్ బెట్టింగ్‌ కడతాడనే నిజాన్ని 2021లో భార్య రంజిత గ్రహించిందని ఆమె తండ్రి వెంకటేష్ పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారుల నిత్యం వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. త్వరగా డబ్బులు ఇప్పిస్తానని తన అల్లుడిని ఎరగా వేసి బెట్టింగ్‌కు పాల్పడ్డాడని తెలిపారు.

అతను (దర్శన్) బెట్టింగ్‌లో పాల్గొనడానికి ఇష్టపడలేదు. కానీ, కొందరు అతనిని బలవంతం చేశారని, అతని బెట్టింగ్ కార్యకలాపాలకు కొన్ని ఖాళీ చెక్కులకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు తమ విచారణలో రంజిత సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. అందులో మృతురాలు తమ కుటుంబం ఎదుర్కొన్న వేధింపులను వివరించింది.

Read Also : Apple iPhone 14 discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.57వేలకే సొంతం చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు