మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం

  • Publish Date - May 7, 2019 / 09:18 AM IST

సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం అయింది. ఎనిమిది రోజుల శిశువును గుర్తు తెలియిన మహిళ ఎత్తుకెళ్లింది. ఆస్పత్రిలో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాధవి, మల్లేష్ దంపతులు. ఏప్రిల్ 30 శుక్రవారం మాధవి డెలివరి కోసం భర్త మల్లేష్ తో కలిసి సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రికి వచ్చారు. ఏప్రిల్ 30 వ తేదీన మాధవి ప్రసవించింది. 

మే 6 సోమవారం ఉదయం ఆయా వచ్చి పాపకు పచ్చ కామెర్లు వచ్చాయని ట్రీట్ మెంట్ కోసం పాపను తీసుకెళ్లింది. అయితే పాపను అప్పగించే ముందు తల్లిదండ్రుల పేర్లు నిర్ధారణ చేసుకోకుండా మే 7 మంగళవారం వేరే వారికి పాపను అప్పగించారు. అయితే తల్లిదండ్రులు పాప గురించి ఆయాను అడగగా ఎప్పుడో అప్పగించామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 

దీంతో తల్లిదండ్రులు డీఎంహెచ్ వో దగ్గరకు వెళ్లగా అక్కడ కూడా నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. ‘మీరు దగ్గరుండి చూసుకోవాలి’ అని తల్లిదండ్రులకు చెప్పారు. పాప తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి దగ్గర ఆందోళన చేపట్టారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయిని తల్లిదండ్రులు చెబుతున్నారు. సంఘటనాస్థలికి డీఎస్ పీ చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని తల్లిదండ్రులకు తెలిపారు.