Ranya Rao Fined: కన్నడ నటికి బిగ్ షాక్.. రూ.102 కోట్లు ఫైన్.. చెల్లించకుంటే ఆస్తులు సీజ్..!
జరిమానా చెల్లించకపోతే ఆస్తులు మొత్తం జప్తు చేస్తామని డీఆర్ఐ హెచ్చరించింది.

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకి డీఆర్ఐ బిగ్ షాక్ ఇచ్చింది. భారీ జరిమానా విధించింది. రూ.102.55 కోట్లు చెల్లించాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. రన్యారావు సహా నలుగురు నిందితులకు మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ వేసింది. జరిమానా చెల్లించకపోతే ఆస్తులు మొత్తం జప్తు చేస్తామని డీఆర్ఐ హెచ్చరించింది. నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైల్లోనే నోటీసులు అందుకున్నారు. బంగారం అక్రమంగా తరలిస్తూ నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకి 102 కోట్లు జరిమానా విధించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ తెలిపింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి 50కోట్లకు పైగా ఫైన్ వేసినట్లు చెప్పారు. రన్యా రావు, ఇతర నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జైల్లోనే వారికి 2500 పేజీలతో కూడిన పెనాల్టీ నోటీసులు ఇచ్చినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 14.8 కిలోల బంగారంతో నటి రన్యా రావు పట్టుబడ్డారు. ఆమె దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చారు.
రన్యా రావు, ఇతర నిందితులకు జైల్లోనే నోటీసులు ఇచ్చారు. జరిమానా చెల్లించాలని చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.
నటి రన్యా రావు సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ కె రామచంద్ర రావు కూతురు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా సెన్సేషనల్ అయ్యింది. రన్యా రావు స్మగ్లింగ్ కేసు వెలుగుచూడగానే.. రామచంద్రరావుని ఉన్నతాధికారులు సెలవు మీద పంపేశారు.
పోలీసులు దర్యాఫ్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యా రావు తరుచుగా దుబాయ్ వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. 2023 నుంచి 2025 మధ్య కాలంలో ఏకంగా 52 సార్లు దుబాయ్ ట్రిప్ వెళ్లినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. అంతేకాదు కస్టమ్స్ అధికారుల తనిఖీలు నుంచి తప్పించుకునేందుకు రన్యా రావు పోలీస్ ఎస్కార్ట్ ని వాడుకున్నారు. రన్యా రావు ఇంట్లో అధికారులు చేసిన తనిఖీల్లో భారీ డబ్బు, నగదు పట్టుబడ్డాయి. 2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు 2 కోట్ల 67 లక్షల రూపాయల క్యాష్ ను పోలీసులు సీజ్ చేశారు.
డీఆర్ఐ కస్టడీలో అధికారులు తనను వేధించారని రన్యా రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తనను 10 నుంచి 15 సార్లు కొట్టారని చెప్పింది. తనకు ఆహారం పెట్టే వారు కాదంది. నిద్రపోనిచ్చే వారు కాదంది. ఖాళీ పత్రాలు, పేపర్లపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపణలు చేసింది.
Also Read: 1400 మందికిపైగా దుర్మరణం.. ఊళ్లకు ఊళ్లే మాయం.. అప్ఘానిస్థాన్‌లో భూకంపం విధ్వంసం..