×
Ad

Porn Addiction : శాడిస్ట్ భర్త…పోర్న్ సైట్లు చూస్తూ…

చాలా మంది మగవాళ్లకు ఇంట్లో అందమైన భార్య ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. దాంతో సుఖాన ఉన్న సంసారాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటారు.

  • Published On : November 3, 2021 / 03:50 PM IST

Porn Addiction

Porn Addiction :  చాలా మంది మగవాళ్లకు ఇంట్లో అందమైన భార్య ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. దాంతో సుఖాన ఉన్న సంసారాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటారు. ఒక వ్యక్తికి  పోర్న్ సైట్స్ చూడటం అలవాటయ్యింది. చివరికి అది వ్యసనంగా మారింది. పోర్న్ సైట్లు చూడద్దన్న భార్యను చిత్రహింసలకు గురి చేసాడు. భర్త ఆగడాలను భరించలేని ఇల్లాలు కోర్టు మెట్లు ఎక్కింది.

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని జయనగర్ లో ఉంటున్న ఓ మహిళకు 2019 నవంబర్ లో వివాహాం అయ్యింది. పెళ్లైన కొన్నాళ్ల  నుంచి భర్తకు ఉన్న దుర్వ్యసనాన్ని భార్య గమనించింది. భర్త ఎక్కువగా పోర్న్ సైట్లు చూస్తూ ఉంటాడు. పోర్న్ సైట్లలో దొరికే కాల్ గర్ల్స్ తో చాటింగ్ చేయటం… వారి కోసం డబ్బులు ఖర్చు చేయటం గమనించింది.

ఇలాంటివి మానుకోమని భర్తకు హితవు చెప్పింది. భార్య మాట వినని భర్త మరింత వేధించేవాడు. పాచిపోయిన అన్నం పెట్టేవాడు. ఇంట్లో గదిలో తాళం పెట్టి బయట ప్రపంచాన్ని చూడకుండా చేసేవాడు. ఇటీవల ఆమె భర్త తన పేరుమీద మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ప్రోఫైల్ క్రియేట్ చేశాడు. అందులో తాను విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.

Also Read : Extra Marital Affair : భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం….

దీంతో భర్త ఆగడాలు  భరించలేని  భార్య,  భర్త బాగోతాన్ని అతని తల్లితండ్రులకు వివరించింది. వారు కూడా కొడుకునే సమర్ధించారు. దీంతో భర్త ఆగడాలపై మహిళ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు మహిళ భర్త మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.