Thane Horror: ఫ్లైఓవర్ పై గోడను ఢీకొని కింద పడిపోయిన బైకర్లు.. గాయాలతో ఇద్దరు మృతి
స్థానికుడైన ప్రతీక్ వినోద్ మోరె, ఉల్హాస్ నగర్‌కు చెందిన రాజేష్ బెచెన్ ప్రసాద్ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లై ఓవర్ మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి ఫ్లై ఓవర్ సైడ్ ప్రొటెక్షన్ వాల్‌ను ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ ఫ్లై ఓవర్ మీద నుంచి కింద రోడ్డుపై పడిపోయారు.
- Narender Thiru
- Published On : January 25, 2023 / 12:18 PM IST
Thane Horror: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్తున్న బైకు అదుపుతప్పి సైడ్ వాల్‌ను ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ ఫ్లై ఓవర్ మీద నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. మహారాష్ట్రలోని థానె పట్టణం, క్యాజిల్ మిల్ నాకా అనే ఫ్లై ఓవర్‌పై బుధవారం ఉదయం 03.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
Pawan Kalyan: ఇంద్రకీలాద్రికి పవన్ కల్యాణ్… ‘వారాహి’కి వాహన పూజ చేయించిన జనసేనాని
స్థానికుడైన ప్రతీక్ వినోద్ మోరె, ఉల్హాస్ నగర్‌కు చెందిన రాజేష్ బెచెన్ ప్రసాద్ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లై ఓవర్ మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి ఫ్లై ఓవర్ సైడ్ ప్రొటెక్షన్ వాల్‌ను ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ ఫ్లై ఓవర్ మీద నుంచి కింద రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటన సమాచారాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
