Uttar Pradesh : స్నేహితురాలితో తిరుగుతున్న బీజేపీ నేతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య-దేహశుధ్ధి చేసిన బంధువులు
పెళ్లాం పిల్లలు ఉన్న బీజేపీ నేత ఒకరు తన స్నేహితురాలితో కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ కల్సి కారులో షికారు కెళ్లారు.
- chvmurthy
- Updated on- August 22, 2022 / 04:25 PM IST
UP BJP leader caught with girl friend
Uttar Pradesh : పెళ్లాం పిల్లలు ఉన్న బీజేపీ నేత ఒకరు తన స్నేహితురాలితో కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ కల్సి కారులో షికారు కెళ్లారు. ఇది గమనించిన అతని భార్య, అత్తింటివారు…. స్నేహితురాలి భర్త ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుధ్ది చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేస్ లో బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యదర్శి మోహిత్ సోంకర్, తన స్నేహితురాలు, బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో కలిసి కారులో వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనంతరం తిరిగి ఇద్దరూ షికారు చేస్తుండగా సోంకర్ భార్య, అత్తింటి వారు, బిందు భర్త కలిసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అత్తింటివారు సోంకర్ ను చెప్పుతో కొట్టగా… ఇతర కుటుంబ సభ్యులు సోంకర్ ను చితక్కొట్టారు. అనంతరం సోంకర్ భార్య, బిందు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే దీనిపై దర్యాప్తు చేసిన తర్వాతే కేసు నమోదు చేస్తామని ఏసీపీ బాబుపూర్వా తెలిపారు. ఇలా ఉండగా సోంకర్ను కొట్టే దృశ్యాలను అతని భార్య వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
