Bollaram Kidnapping Case : బొల్లారంలో చిన్నారి కిడ్నాప్, మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..! సెక్యూరిటీ గార్డే హంతకుడు..

Bollaram kidnapping case : సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కౌకూరు విల్లా ఆర్కిడ్స్ లో అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్ శవమై తేలింది.

Bollaram Child kidnapping Case

Bollaram kidnapping case : సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కౌకూరు విల్లా ఆర్కిడ్స్‌లో అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్ శవమై తేలింది. పాప కనిపించకుండా పోయినప్పటి నుంచి పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : Solar Storm : దూసుకొస్తున్న సౌర తుఫాను.. భూమిపై ఎలాంటి ప్రభావం చూపనుంది? శాటిలైట్లు, జీపీఎస్ వ్యవస్థలకు..

ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విల్లా కాలనీతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరిసర లాడ్జీలను జల్లెడ పట్టారు. డ్రోన్స్ సహాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే, క్లబ్‌హౌస్ సమీపంలో ఉన్న సైకిల్‌ను గమనించిన పోలీసులు అక్కడ తనిఖీలు చేయగా.. సెల్లార్ నీటిలో చిన్నారి మృతదేహాం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో పాప కిడ్నాప్, హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని కిడ్నాప్ చేసి.. ఆ తరువాత హత్య చేసింది సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌గా గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం పాపను కిడ్నాప్ చేసి డబ్బులు వసూళ్లు చేయాలని బీహార్‌కు చెందిన సెక్యూరిటీగార్డు విక్రమ్ ప్లాన్ వేశాడు. అతనికి మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషియన్ సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, సీసీ కెమెరాల్లో గత రెండు రోజులుగా నిందితుడు ఆ చిన్నారి ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. చిన్నారి వెనుకాలే నిందితుడు వెళ్తున్న దృశ్యాలు అపార్టుమెంట్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

చిన్నారి కిడ్నాప్ అనంతరం ఆ చిన్నారి తండ్రికి సెక్యూరిటీ సిబ్బంది వినియోగించే మొబైల్ ఫోన్ నుంచి నిందితుడు విక్రమ్ ఫోన్ చేశాడు. పాప హత్య అనంతరం మొబైల్ ఫోన్లో ఉన్న సిమ్‌తో విక్రమ్ ఎస్కేప్ అయ్యాడు. ఆ మొబైల్ ఫోన్ మరో సెక్యూరిటీ సిబ్బంది వద్ద విల్లాస్ యాజమానులు గుర్తించారు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది విక్రమ్ ను విల్లాస్ అసోసియేషన్ వారం క్రితమే తొలగించింది. కక్షతోనే చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు విక్రమ్ స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

చిన్నారిని కిడ్నాప్ చేసే సమయంలో విల్లాలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. అయితే, నిందితుడు విక్రమ్ బాలికను కిడ్నాప్ చేసే సమయంలో స్పీకర్స్ సౌండ్ ఎక్కువగా పెట్టాలని ఎలక్ట్రీషియన్‍కు సూచించినట్లు తెలిసింది. అంతేకాక.. మరో సెక్యూరిటీ గార్డు వాడే ఫోన్‌ను తీసుకొని చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నిందితుడు విక్రమ్.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, చిన్నారి కిడ్నాప్ కేసులో ఎలక్ట్రిషియన్, మరో సెక్యూరిటీ గార్డ్ ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు.

కిడ్నాప్ తరువాత కుటుంబ సభ్యుల నుంచి నిందితుడు రూ.20లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు సర్దుబాటు చేస్తామని, పాపను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. అయితే, చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు అనుమానించిన నిందితుడు.. తన వద్ద ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. అందులోని సిమ్ తీసుకొని చిన్నారిని హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే, చిన్నారిని కిడ్నాప్ చేసిన అనంతరం బయటకు తీసుకెళ్లేందుకు సెక్యూరిటీ గార్డు విక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ, క్లబ్‌హౌస్ పరిసరాల్లో చిన్నారి కోసం ఆమె తాత వెతుకుతుండటంతో నిందితుడు చిన్నారిని బయటకు తీసుకెళ్లలేకపోయాడు. పోలీసులు వస్తారని భావించి చిన్నారని హత్య చేసి.. మృతదేహాన్ని నీటి సంపులో పడేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

నిందితుడు విక్రమ్ కోసం సికింద్రాబాద్, కూకట్‌పల్లి, పటాన్ చెరువు, బాలనగర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు.. పలువురు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.