×
Ad

Boy Friend Attack : ప్రేమ పేరుతో ప్రియురాలిపై దాడి, దోపిడీ చేసిన ప్రియుడు

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుందాం రమ్మనమని చెప్పిన ప్రియుడు.... తీరా వచ్చాక ఆమెపై దాడి చేసి బ్యాగు తీసుకుని పారిపోయాడు. 

  • Published On : November 19, 2021 / 12:29 PM IST

Two minor Girls kidnapped

Boy Friend Attack :  గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుందాం రమ్మనమని చెప్పిన ప్రియుడు…. తీరా వచ్చాక ఆమెపై దాడి చేసి బ్యాగు తీసుకుని పారిపోయాడు.

Also Read : Wife Extra Marital Affair : వివాహేతర సంబంధం-భార్యను చంపి మామకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు
పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే శ్రీకాంత్ అనే యువకుడికి విజయనగరంలో  నివసించే యువతితో పరిచయం ఏర్పడింది. క్రమేపి అది ప్రేమగా మారింది.  ఈక్రమంలో మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఆ యువతి శ్రీకాంత్ ను కోరింది.  అందుకు సమ్మతించిన శ్రీకాంత్ యువతిని పెదకాకాని రమ్మన్నాడు.

పెదకాకాని వచ్చిన యువతితో   శ్రీకాంత్ ప్రేమగా ఉంటూనే,  ఆమెపై   బ్లేడ్ తో దాడి చేసి ఆమె   బ్యాగ్ తీసుకని పరారయ్యాడు.  తీవ్రగాయాలపాలైన యువతిని స్ధానికులు ఆస్పత్రికి తరలించారు.  యువతి ఫిర్యాదుతో కేసు  నమోదు చేసుకున్న పెదకాకాని పోలీసులు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.