Chikoti Praveen : క్యాసినోల నిర్వహణ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న చీకోటి ప్రవీణ్ ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్‌లకు సోషల్ మీడియా ఎకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. తన పేరును కించ పరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారని ఆయన తెలిపారు.
రాజకీయ స్వార్ధం కోసం అపోజిషన్ పార్టీలు చేస్తున్న కుట్రగా అనుమానం ఉందని ఆయన వివరించారు. తన పేరుతో ఉన్న సోషల్ మీడియా పోస్టుల్లో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించాలని పోలీసులను కోరారు.
ఫేక్ అకౌంట్ వల్ల తాను చాలా మానసిక ఒత్తిడికి గురౌతున్నానని ఫిర్యాదులో వివరించారు. పబ్లిక్‌లో, మీడియా ముందు ఈ ఫేక్ అకౌంట్ వల్ల తాను బద్నాం అవుతున్నా అన్నారు. వీలయినంత త్వరగా నిందితుడిని పట్టుకోవాలని ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.