Wife Swapping : ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా? ఏకంగా భార్యలను మార్చుకుని ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే

Wife Swapping Party : వైఫ్ స్వాపింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఒక పేజీ క్రియేట్ చేశారు. భార్య మార్పిడి పార్టీకి వచ్చి ఎంజాయ్ చేయాలని అనుకుంటే..

Wife Swapping : ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా? ఏకంగా భార్యలను మార్చుకుని ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే

Wife Swapping (Photo : Google)

కలికాలం అంటే ఇదేనేమో. మనిషి మృగంలా తయారవుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వికృతమైన ఆలోచనలతో, నీచమైన లైంగిక చర్యలతో దిగజారిపోతున్నాడు. ఏకంగా భార్యలనే మార్చుకుని ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ విష సంస్కృతి విస్తుపోయేలా చేస్తోంది. ఈ పరిణామం సభ్య సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

వైఫ్ స్వాప్ పార్టీ భగ్నం..
తాజాగా చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యల మార్పిడి దందా గుట్టు రట్టైంది. చెన్నై శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఏకంగా భార్యల మార్పిడి పార్టీనే ఏర్పాటు చేశారు. చెన్నై సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన వైఫ్ స్వాపింగ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 8 మందిని అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియా ద్వారా ప్రచారం..
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ”కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. భార్యల మార్పిడి పేరుతో తరుచుగా పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ముఠా సభ్యులు భార్యల మార్పిడి పార్టీల గురించి ప్రచారం చేసుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన 8మంది సభ్యుల గ్యాంగ్.. ఈ తరహా వైఫ్ స్వాప్ పార్టీలు నిర్వహించేది. గత 8ఏళ్లుగా వారు ఈ విధంగా పార్టీలు చేస్తున్నారు. చెన్నైతో పాటు కోయంబత్తూరు, మధురై, సేలం, ఈరోడ్ ప్రాంతాల్లో ఈ వైఫ్ స్వాప్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : షాకింగ్.. అడల్ట్ వీడియో చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు యాక్టర్లు

ఒక్కొక్కరి నుంచి రూ.13వేల నుంచి రూ.25వేలు వసూలు..
ఈ గ్యాంగ్ టార్గెట్ ఒంటరి పురుషులే. వారిని పరిచయం చేసుకుంటారు. కొంతమంది మహిళలను తీసుకొచ్చి వారు తమ భార్యలు అని ఒంటరి పురుషులతో చెబుతారు. ఆ తర్వాత భార్యలను మార్చుకుని ఎంజాయ్ చేద్దామని ఊరిస్తారు. వైఫ్ స్వాపింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఒక పేజీ క్రియేట్ చేశారు. భార్య మార్పిడి పార్టీకి వచ్చి ఎంజాయ్ చేయాలని అనుకుంటే.. ఒక్కొక్కరు రూ.13వేల నుంచి రూ.25వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ డబ్బు చెల్లిస్తే.. అంతమంది మహిళలతో ఎంజాయ్ చేయొచ్చని చెబుతారు” అని పోలీసులు వెల్లడించారు.

మహిళలకు డబ్బు ఆశ చూపి..
”8మంది పురుషులను అరెస్ట్ చేయడంతో పాటు అనేక మంది మహిళలను కాపాడారు. వారంతా 30 నుంచి 40ఏళ్ల మధ్య వయస్కులు. వారంతా వివాహితులే. అయితే భారీ డబ్బు ఆశ చూపి వారిని ఈ వృత్తిలోకి తీసుకొచ్చారు. కాగా, ఈ వైఫ్ స్వాప్ పార్టీ గుట్టుని స్థానికులు రట్టు చేశారు. తాము నివాసం ఉండే పక్క ఇంట్లోకి పెద్ద సంఖ్యలో పురుషులు వచ్చి వెళ్తున్నారు. అర్థరాత్రి పూట పురుషులు వస్తున్నారు. పైగా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినిపిస్తున్నారు.

దీంతో ఏదో జరుగుతోందని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో వైఫ్ స్వాప్ పార్టీ గుట్టు రట్టైంది. పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మహిళలను వదిలిపెట్టారు. తమ ఇళ్లకు వెళ్లిపోయేందుకు అనుమతి ఇచ్చారు. వారితో పేపర్ల పై రాయించుకున్న తర్వాత విడిచిపెట్టారు” అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Also Read : మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్

భార్యలను మార్చుకుని శృంగారం..
”కోయంబత్తూరుకు చెందిన సెంథిల్‌ కుమార్ (45), జయలక్ష్మి (35) బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో చెన్నైలోని పనయూర్‌లో ఫామ్‌హౌస్‌ను నవంబర్ 4,5 తేదీల్లో బుక్ చేసుకున్నారు. దీనికి 8 జంటలు, 10 మంది యువకులు వచ్చారు. ఇక రాత్రంతా భారీ శబ్దంతో మ్యూజిక్ పెట్టారు. పార్టీలో డ్రగ్స్, మద్యం సేవించారు. తాగిన మత్తులో మహిళలను మార్చుకున్నారు. ఒకరి భార్యతో మరొకరు శృంగారంలో పాల్గొన్నారు. దీనిపై మాకు సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగాము. ఫాంహౌస్‌ లో రైడ్స్ చేసి వైఫ్ స్వాప్ పార్టీని భగ్నం చేశాము” అని పోలీసులు వివరించారు.

డబ్బు అవసరం ఉన్న మహిళలే టార్గెట్..
”సెంథిల్‌కుమార్, జయలక్ష్మి గత 8ఏళ్లుగా ఈ దందా నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మహిళలకు సోషల్ మీడియా ద్వారా గాలం వేసి స్వాప్‌ పార్టీలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో స్వాప్ పార్టీ పేరుతో ఓ పేజీని సృష్టించారు. శృంగారం పేరుతో మహిళల ఫోటోలను షేర్ చేస్తున్నారు” అని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, గతేడాది కేరళలో భార్యల మార్పిడి వ్యవహారం వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వికృతమైన లైంగిక కోరికలతో మనిషి దిగజారిపోతున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది.