Police Arrest Actors : షాకింగ్.. అడల్ట్ వీడియో చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు యాక్టర్లు

Obscene Acts : దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

Police Arrest Actors : షాకింగ్.. అడల్ట్ వీడియో చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు యాక్టర్లు

Arrest (Photo : Google)

పోర్న్ వీడియో చేస్తూ ముగ్గురు యాక్టర్లు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వారంతా యాక్టర్లు కావడం గమనార్హం.

ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. సబ్ స్క్రిప్షన్ పద్దతిలో ఓ యాప్(Pihu) ద్వారా పోర్న్ వీడియోను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. వీడియో, ఆడియో కాల్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

ఈ కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ” అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరి వయసు 20ఏళ్లు, మరొకరి వయసు 34ఏళ్లు. పట్టుబడ్డ పురుషుడి వయసు 27ఏళ్లు. పోర్న్ వీడియోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. పోర్న్ వీడియోలు తీస్తున్నట్లుగా మాకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు వేచి చూశాము.

Also Read : కర్ణాటక ప్రభుత్వ అధికారిణి హత్య కేసులో వీడిన మిస్టరీ..! హంతకుడు వీడే..? హత్యకు కారణం తెలిసి పోలీసులు షాక్

ఈ క్రమంలో అంధేరి వెస్ట్ లోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో షూట్ జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే రైడ్ చేసి పట్టుకున్నాం. ఇప్పటికి ముగ్గురిని అరెస్ట్ చేశాము. యాప్ ఓనర్లు, ఆపరేటర్లు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారందరినీ పట్టుకుంటాం. పోర్న్ వీడియో స్ట్రీమింగ్ గురించి ఇన్ స్టా గ్రామ్ లో యూజర్లకు సమాచారం ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు కాయిన్స్ కొనుక్కోవాలి. వాటిని రీడీమ్ చేసుకోవడం ద్వారా వీడియోలు చూడొచ్చు. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7వేల500. వీడియో చూడటానికి ముందు డబ్బు చెల్లించాలి. కాల్స్ కోసం అదనంగా పే చేయాల్సి ఉంటుంది” అని పోలీసులు తెలిపారు.

కాగా, యాప్ ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 292 (అశ్లీల కంటెంట్‌ను విక్రయించడం లేదా బహిరంగంగా పంపిణీ చేయడం), 293 (20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి అశ్లీల కంటెంట్‌ను విక్రయించడం లేదా పంపిణీ చేయడం) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read : షాకింగ్ వీడియో.. లైవ్‌లో యాంకర్ దారుణ హత్య, గన్‌తో కాల్చి చంపిన దుండగుడు

”నిందితులందరూ ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నారు. యూజర్లు చెల్లించిన డబ్బు జమ అయిన ఖాతాలను ట్రాక్ చేస్తున్నాం. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నాము”అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.