Radio Anchor Shot : షాకింగ్ వీడియో.. లైవ్‌లో యాంకర్ దారుణ హత్య, గన్‌తో కాల్చి చంపిన దుండగుడు

స్టేషన్ రూమ్ లోకి చొరబడ్డ దుండగుడు వెంటనే గన్ బయటకు తీసి వార్తలు చదువుతున్న రేడియో యాంకర్ పై కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి ఫైరింగ్ చేయడంతో రేడియో యాంకర్ స్పాట్ లోనే చనిపోయాడు. Radio Anchor Shot Dead

Radio Anchor Shot : షాకింగ్ వీడియో.. లైవ్‌లో యాంకర్ దారుణ హత్య, గన్‌తో కాల్చి చంపిన దుండగుడు

Radio Anchor Shot Dead Update (Photo : Google)

Radio Anchor Shot Dead : దక్షిణ ఫిలిప్పీన్స్ స్టేషన్ లో దారుణం జరిగింది. రేడియో యాంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుడు రేడియో యాంకర్ పై కాల్పులు జరిపి హతమార్చాడు. ఇదంతా లైవ్ లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు షాక్ కి గురయ్యారు.

అది ప్రాంతీయ వార్తల ప్రసారం కేంద్రం. జువాన్ జుమాలోన్ యాంకర్ గా పని చేస్తున్నాడు. రోజూలానే ఆదివారం డ్యూటీకి వచ్చాడు. వార్తలు చదువుతున్నారు. ఇదంతా ఫేస్ బుక్ లో లైవ్ వస్తోంది. సడెన్ ఓ వ్యక్తి రేడియో స్టేషన్ లైవ్ రూమ్ లోకి చొరబడ్డాడు. గెస్ట్ లా వచ్చిన అతడు తనతో పాటు గన్ తెచ్చుకున్నాడు. రూమ్ లోకి చొరబడ్డ దుండగుడు వెంటనే గన్ బయటకు తీసి వార్తలు చదువుతున్న రేడియో యాంకర్ పై కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి ఫైరింగ్ చేయడంతో రేడియో యాంకర్ స్పాట్ లోనే చనిపోయాడు.

Also Read : భార్యను పొడిచి చంపిన భారతీయుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు

కాగా, దుండగుడు కాల్పులు జరపడం లైవ్ లో ప్రసారమైంది. ఫేస్ బుక్ లో ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. ఈ హత్యను కళ్లారా చూసిన వీక్షకులు షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు యాంకర్ రక్తపు మడుగులో శవమై కనిపించాడు.

కాల్పులు జరిపిన దుండగుడు.. పోతూ పోతూ యాంకర్ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. రేడియో స్టేషన్ బయట మరో వ్యక్తి బైక్ పై ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగుడు అతడి బైక్ ఎక్కి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడు ఎవరు? ఎందుకు యాంకర్ ని కాల్పి చంపాడు? అసలేం జరిగింది? ఈ మిస్టరీ చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read : ఆ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చిందా? లిఫ్ట్ చేశారో ఇక అంతే- పోలీసుల వార్నింగ్

కాగా, జర్నలిస్టులకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఫిలిప్సీన్స్ ను పరిగణిస్తారు. ఇక్కడ జర్నలిస్టులకు రక్షణ లేదు. జర్నలిస్టులపై దాడులు, హత్యలు నిత్యకృతంగా మారాయి. రేడియో యాంకర్ దారుణ హత్యను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ తీవ్రంగా ఖండించారు. హంతకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఓ నివేదిక ప్రకారం ఫిలిప్పీన్స్ లో 1986 నుంచి ఇప్పటివరకు 199 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారు.