Man Shot : షాకింగ్.. కూతురిని భుజాలపై మోసుకెళ్తున్న తండ్రి, ఇంతలో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి
షోయబ్ వెనుకే వస్తున్న అతడి కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. తమ కళ్ల ముందే దుండుగుల షోయబ్ పై కాల్పులు జరపడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. Chilling Video - Man Shot
- Naveen
- Published on- August 15, 2023 / 12:38 AM IST
Chilling Video - Man Shot (Photo : Google)
Chilling Video – Man Shot : ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ఏడాదిన్నర వయసున్న కూతురిని భుజాలపై మోసుకుని వెళ్తుండగా దుండగుడు అతి సమీపం నుంచి అతడిపై గన్ తో కాల్పులు జరిపాడు. బబుజాయ్ ప్రాంతానికి చెందిన షోయబ్ ఆదివారం రాత్రి తన కూతురిని భుజాలపై మోస్తూ బంధువుల ఇంటికి వెళ్తున్నాడు.
ఇంతలో బైక్ పై ముగ్గురు దుండగులు అతడికి ఎదురుగా వచ్చారు. ఇద్దరు వ్యక్తులు బైక్ ఉన్నారు. మరో వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వచ్చాడు. షోయబ్ దగ్గరగా రాగానే అతడు తన టీషర్ట్ లో దాచుకున్న గన్ ను బయటకు తీసి షోయబ్ పై పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపాడు. అంతే షోయబ్ ఒక్కసారిగా కుప్పకూలాడు.
Also Read..Nurse Gangraped : ఆసుపత్రిలో దారుణం.. నర్సుని గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన డాక్టర్, సిబ్బంది
కాల్పులు జరిపిన దుండగుడు బైక్ పై పరార్ అయ్యాడు. షోయబ్ వెనుకే వస్తున్న అతడి కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. తమ కళ్ల ముందే దుండుగుల షోయబ్ పై కాల్పులు జరపడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. వెంటనే షోయబ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, షోయబ్ కూతురు చిన్న గాయాలతో సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడింది. దుండగుడు అతి సమీపం నుంచి షోయబ్ పై ఫైరింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కాల్పులు జరిపిన వ్యక్తిని తారిక్ గా గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మూడో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తి సోదరుడికి ఓ మహిళతో మొదట నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత నిశ్చితార్ధం క్యాన్సిల్ అయ్యింది. ఆ మహిళే షోయబ్ ను పెళ్లి చేసుకుంది. నిశ్చితార్థం రద్దు కావడాన్ని అవమానంగా భావించిన అతడు ప్రతీకార చర్యగా షోయబ్ ను చంపాలని చూసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read..Shamshabad: శంషాబాద్ మహిళ హత్య కేసు.. ఆమెను తగులబెట్టింది మరో మహిళే.. ఎందుకంటే?
బాధితుడు షోయబ్ మామ పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇచ్చాడు. షోయబ్, చాందినిని సుమారు మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ముందు, మొహల్లేలోని పొరుగున ఉన్న వోల్ ప్రాంతంలో నివసించే తారిక్ సోదరుడితో చాందినీకి నిశ్చితార్థం జరిగింది. అయితే పలు కారణాలతో ఆ నిశ్చితార్ధం క్యాన్సిల్ అయ్యింది. తారిక్ సోదరుడితో వివాహం చేయకూడదని నిర్ణయించుకున్నారు. బదులుగా షోయబ్ని ఎంచుకున్నారు. చాందినికి అతడితో పెళ్లి జరిపించారు. ఈ నిర్ణయం తారిక్ ను తీవ్రంగా గాయపరిచింది. ఇది తనకు, తన కుటుంబానికి అవమానంగా ఫీల్ అయ్యాడు. జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని తారిక్ చాలాసార్లు వ్యక్తం చేశాడు. చివరికి అదను చూసి షోయబ్ పై కాల్పులు జరిపాడు. అతడిని హత్య చేయాలని చూశాడు.
