Couple Romance On Scooter : హవ్వ.. నడిరోడ్డులో రన్నింగ్ బైక్‌పై అసభ్యకర చేష్టలు.. బుద్ధి చెప్పిన పోలీసులు
ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. రన్నింగ్ బైక్ పై రొమాన్స్ చేసింది. ముద్దులు పెట్టుకుంటూ, హగ్గులు ఇచ్చుకున్నారు. ప్రమాదకరంగా ప్రయాణించిన వారి వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
- Naveen
- Published On : January 18, 2023 / 07:31 PM IST
Couple Romance On Scooter : ఇటీవలి కాలంలో కొందరు యువతీ, యువకులు రెచ్చిపోతున్నారు. నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. నడి రోడ్డులో రన్నింగ్ బైక్ పై రొమాన్స్ చేస్తున్నారు. తమ విపరీత చర్యలతో, అసభ్యకర చేష్టలతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా లక్నోలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. బైక్ పై ముద్దులు పెట్టుకుంటూ ప్రమాదకరంగా ప్రయాణించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జంట కోసం గాలింపు చేపట్టారు. వీడియోలో ఉన్న యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
స్కూటర్‌పై ఓ యువకుడు అతడి ప్రియురాలు వెళ్తున్నారు. ఆమె అతడి ఒళ్లో రివర్స్‌లో కూర్చొని ఉంది. అంతేనా.. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. ఆ జంట బరితెగించింది. నిస్సిగ్గుగా ముద్దులు పెట్టుకుంటూ రాసలీలలు సాగిస్తూ ముందుకు సాగిపోయింది. వాళ్ల ప్రవర్తన కాస్త అశ్లీలంగానూ ఉంది. అబ్బాయి స్కూటీ నడుపుతున్నాడు. అతడి ఒళ్లో కూర్చున్నట్టుగా కూర్చున్న అమ్మాయి అతడిని గట్టి హత్తుకుంది. మధ్యమధ్యలో ముద్దులు పెట్టింది. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (జనవరి 17) రాత్రి చోటు చేసుకుందీ ఘటన. వాళ్ల ప్రవర్తనతో విసిగిపోయిన తోటి వాహనదారులు.. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ జంట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నడిరోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణం చేసిన జంటను, తమ అసభ్యకర చేష్టలతో ఇతరులను ఇబ్బంది పెట్టిన జంటను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో ఖాకీలు రంగంలోకి దిగారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఆ జంటకు బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. బండి నెంబర్ ఆధారంగా పోలీసులు యువకుడిని గుర్తించారు. ఆ యువకుడిని అరెస్ట్ చేసి అత్తారింటికి పంపారు. అతడి స్కూటర్ ను సీజ్ చేశామన్నారు. అతడిపై ఐపిసి 294, 279 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడితో కలిసి బైక్ పై అసభ్యకరంగా ప్రవర్తించిన అమ్మాయిని మైనర్ బాలికగా గుర్తించారు పోలీసులు. ఎవరైనా ఇలాంటి వెర్రి వేశాలు వేస్తే తాటతీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
కాగా, ఏపీలోని విశాఖపట్నం జిల్లా గాజువాకలోనూ గత నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో పల్సర్ బైక్‌పై ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. పెట్రోల్ ట్యాంక్ పై ప్రియురాలిని రివర్స్‌లో కూర్చో పెట్టుకునాడు యువకుడు. తాము రోడ్డుపై ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి గట్టిగా వాటేసుకున్నారు. ముద్దుల్లో మునిగి తేలారు. ఆ బైక్ వెనకాలే వస్తున్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. సీన్ లోకి వచ్చిన పోలీసులు ఆ జంటపై చర్యలు తీసుకున్నారు.
तहजीब के शहर लखनऊ में अश्लीलता फैलाने वाले विक्की को पुलीस ने धर दबोचा pic.twitter.com/eSrIZRCSxV
— Tushar Srivastava (@TusharSrilive) January 18, 2023
