×
Ad

Woman Ends life : కుటుంబ సమస్యలతో వివాహిత బలవన్మరణం

కుటుంబ సమస్యలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.

  • Published On : April 9, 2021 / 11:59 AM IST

Divorced Woman Ends Life

Divorced woman ends life : కుటుంబ సమస్యలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని హులియారు సమీపంలోని కోడిపాళ్య గ్రామానికి చెందిన కవిత(37) తురువెకెరె–తిపటూరులోని కాలేజీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కోడిపాళ్యలోని ధ్యాననగరి మాతా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్ధాపకురాలిగా కూడా ఉన్నారు.

ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. కవిత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. ఇలా ఉండగా బుధవారం సాయంత్రం కవితి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా చేశారు.

ఇది గమనించిన కుటుంబ సభ్యలు ఆమెను వెంటనే తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం కవిత మృతి చెందారు. కుటుంబ సమస్యలతోనే  కవిత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.