×
Ad

Two Cops Died : స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి

రాజస్ధాన్ లోని భిల్వారా జిల్లాలో మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు.

  • Published On : April 11, 2021 / 04:26 PM IST

Two Cops Died

Drug smugglers open fire, two Cops killed in Rajasthan : రాజస్ధాన్ లోని భిల్వారా జిల్లాలో మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు. జిల్లాలోని కోటి, రాయికా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

ఆ సమయంలో రెండు వాహనాల్లో అటుగా వచ్చిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ల వాహనాలను పోలీసులు ఆపి తనిఖీ చేసేందుకు యత్నించారు. స్మగ్లర్లు తమ వాహానాలను ఆపినట్లే ఆపి, ఒక్కసారివేగం పెంచి పోలీసుల పైకి కాల్పులు జరుపుతూ బారికేడ్లను ఢీకొట్టి పారిపోయారు.

స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన కానిస్టేబుళ్లు ఓంకార్ రాయికా, పవన్ చౌదరిగా గుర్తించారు. నిందితులకోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ వికాశ్ శర్మ తెలిపారు.