Drunken Woman : మందేసినోళ్ల వేషాలు ఎట్టా ఉంటాయో చాలా మందికి తెలుసు. ఒకడు తూలుకుంటూ వెళుతుంటే… మరోకడు ఇంకో రకంగా వ్యవహరిస్తుంటాడు. కొందరు గాన గంధర్వులైతే …ఇంకోందరు ఎదుటివాళ్లమీద చిందులేస్తారు. కానీ పూణే లో ఒక మహిళ మందేసి రోడ్డుమీద యోగాసనాలు వేయటం మొదలెట్టింది.
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పూణే లోని తిలక్ రోడ్డు హీరాబాగ్ చౌక్ వద్ద ఓ మహిళ రోడ్డుపై కూర్చుని వివిధ భంగిమల్లో యోగాసనాలు వేయటం మొదలెట్టింది. ఆ సమయంలో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మహిళ మద్యం సేవించిందని తెలుసుకున్న స్ధానికులు స్వర్గేట్ పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చేసరికి ఆయువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. కానీ యువతి చేసిన విన్యాసాలను తమ సెల్ఫోన్లో రికార్డు చేసిన స్ధానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆవీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘ కిక్కు ఎక్కింది. రోడ్డెక్కి తిక్క తిక్కగా చేసింది.’’ అంటూ కామెంట్ చేశాడు ఒక నెటిజన్.
మరో నెటిజన్ ‘‘లిక్కరేశాక నడిచి వెళ్తే ఏం కిక్కు.. అందుకే ఇలా వెరైటీగా ట్రై చేయాలి.’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ఆమె మందేసిందో.. మాససిక స్థితి బాగోలేదో.. చూడండయ్యా’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియోలలో యువతిని గుర్తించిన పోలీసుల ఆమె కోసం గాలిస్తున్నారు.
A drunk girl in Pune sitting in the middle of the road ?
Video from @IndiaToday pic.twitter.com/7DTiIV9JEs— Varun Bahl?? (@bahl65) August 4, 2021
पुण्यात मद्यधुंद तरुणीचा हंगामा, टिळक रस्त्यावरील हिराबाग चौकात रस्त्यावर झोपून वाहतूक अडवण्याचा प्रयत्न pic.twitter.com/GgfoHlf0jo
— Anish Bendre (@BendreAnish) August 4, 2021