“దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు”… పోలీసులకు సవాల్ విసిరిన నేరస్థుడు అరెస్ట్

Even God cannot catch me’: History-sheeter challenges Mumbai cops arrested most wanted criminal : “దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు”… అని పోలీసులకే  సవాల్ విసిరి కొన్నేళ్ళుగా  తప్పించుకు తిరుగుతున్న నేరస్ధుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబైలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులుండి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పోలీసు రికార్డుల్లో కెక్కిన నేరస్ధుడు పప్పు హరిశ్చంద అలియాస్ ఖోప్డి  అనే  నేరస్దుడిని ముంబై పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ముంబైలోని పోవై ప్రాంతంలో నివసించే ఖోప్డి   పై  పోవాయి, సాకినాకా, ఎంఐడీసీ మరియు ఆరే పోలీసు స్టేషన్లలో డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి.

2013లో ఒకసారి పోలీసులు అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించినప్పుడు అక్కడ్నించి తప్పించుకుని పారిపోయాడు. దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు పోలీసులను…. మర్చిపొమ్మని ఇన్ ఫార్మర్ ద్వారా పోలీసులకు మెసేజ్ పంపించాడు.

అప్పటి నుంచి పోలీసులకు దొరక్కుండా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ పోలీసులకు చిక్కటంలేదు. కానీ ఇటీవల పోలీసులకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు రాయల్ పామ్ ప్రాంతంలో దొంగతనం చేయటానికి సిధ్దమవుతున్నట్లు తెలుసుకున్నారు.

అందులో భాగంగా మఫ్టీలో పోలీసులు ఆ ప్రాంతంలో కాపలా కాయటం మొదలెట్టారు. శుక్రవారం  దొంగతనం  చేయటానికి వచ్చిన ఖోప్డి  ని వలపన్ని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. అతడి వద్ద నుంచి దేశీ పిస్టల్ ను, రెండు లైవ్ క్యాట్రిడ్జలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు