Extramarital Affair: వివాహేతర సంబంధాలు మంచివి కాదని పోలీసులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. అనుమానంతో భార్యను భర్త.. భర్తను భార్య చంపుకుంటున్నారు. వివాహేతర బంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటువంటి బంధాలు మంచివి కాదని, అనర్థాలకు దారితీస్తాయని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు.
పరాయి వ్యక్తి మోజులో పడి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ బంధం బయటపడుతుందనే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. ప్రియుడి ఇంట్లో వివాహిత ఉరివేసుకుంది.
హైదరాబాద్ నాగోల్ పరిధిలో నివాసం ఉంటున్న బానోత్ అనిల్ నాయక్ (24) కు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన మహిళ (38)తో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. అనిల్ తో గడిపేందుకు మహిళ మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామం నుంచి నాగోల్ వచ్చింది. తన కుమారుడి(3)కి చికిత్స చేయిస్తానని ఇంట్లో చెప్పి ఆమె హైదరాబాద్ వచ్చింది. నాగోల్ లోని అనిల్ ఇంటికి వెళ్లింది. అక్కడే రెండు రోజులు ఉంది.
కాగా, కూరగాయలు తెచ్చేందుకు అనిల్ బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాత్రూమ్ లో హ్యాంగర్‌కు చీరతో ఉరివేసుకుంటూ మహిళ కనిపించింది. అది చూసి అనిల్ షాక్ అయ్యాడు. సాయం కోసం చుట్టుపక్కల వారిని పిలిస్తే.. మహిళ తన ఇంట్లో ఉందని తెలిస్తే.. తన పరువు పోతుందని అనిల్ భయపడ్డాడు. సాయం కోసం ఎవరినీ పిలవలేదు. తానే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి మహిళ తుదిశ్వాస విడిచింది.
దీంతో అనిల్ బాగా భయపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. చేయి కోసుకున్నాడు. అయితే, అతడికి ఎదురుగా ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారిని చూశాడు. దీంతో చలించిపోయాడు. వెంటనే చేతికి క్లాత్ కట్టుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇంతలో ఈ విషయం మహిళ కుటుంబసభ్యులకు తెలిసింది. వారు నాగోల్ చేరుకున్నారు. అనిల్‌ను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగింది? ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read: హనుమాన్ పై ట్రంప్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా..