Haircut Shoot : వామ్మో.. కొడుకులు కటింగ్ చేయించుకోలేదని గన్‌తో ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..

తాను చెప్పినా కూడా కొడుకులు కటింగ్ చేయించుకోకపోవడంతో తండ్రి శివ్ ప్రకాశ్ కు విపరీతమైన కోపం వచ్చింది.

Haircut Shoot : మనుషుల్లో క్షణికావేశం అనర్థాలకు దారి తీస్తోంది. హత్యలు, ఆత్మహత్యలకు కారణం అవుతోంది. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. కొన్ని సందర్భాల్లో హత్యలకు పాల్పడ్డారు. మరికొన్ని ఘటనలలో ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా అలాంటి దారుణం ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తన కొడుకులు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి నిరాకరించడంతో వారి తండ్రి క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను గన్ తో కాల్చుకున్నాడు. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు.

వారణాసిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వారణాసిలో నివాసం ఉంటున్న శివ్ ప్రకాశ్ (40) కి ఇద్దరు కొడుకులు. సత్య (18), శుభమ్ (16). హోలీ పండుగ సందర్భంగా.. హెయిర్ కట్ చేయించుకోవాలని శివ్ ప్రకాశ్ తన ఇద్దరు కొడుకులతో చెప్పాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు శివ్ ప్రకాశ్ ఇంటికి వచ్చాడు. తన కొడుకులను చూడగా వారు హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. తాను చెప్పినా కూడా కొడుకులు కటింగ్ చేయించుకోకపోవడంతో తండ్రి శివ్ ప్రకాశ్ కు విపరీతమైన కోపం వచ్చింది. ఈ విషయమై అతడు తన కుమారులతో గొడవపడ్డాడు.

కాసేపటి తర్వాత అతడు తన గదిలోకి వెళ్లాడు. ఆ కాసేపటికే ఆ గది నుంచి గన్ తో కాల్చిన శబ్దం వచ్చింది. దీంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని కంగారుగా శివ్ ప్రకాశ్ గదిలోకి వెళ్లి చూశారు. అంతే అంతా షాక్ కి గురయ్యారు. శివ్ ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడు తన గన్ తో తననే షూట్ చేసుకున్నాడు.

కొడుకులతో గొడవపడిన తండ్రి.. ఆ కోపంలో గదిలోకి వెళ్లి తన లైసెన్స్ గన్ తో కాల్చుకున్నాడని, ఆత్యహత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. తాను చెప్పినా కూడా పిల్లలు మాట వినలేదనే కోపంతో శివ్ ప్రకాశ్ ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని అతడి భార్య పోలీసులతో చెప్పారు. శివ్ ప్రకాశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Also Read : ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.కోటికిపైగా కోల్పోయిన భర్త.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య!

ట్రెండింగ్ వార్తలు