ఢిల్లీలో అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
- murthy
- Published On : December 7, 2020 / 04:06 PM IST
Five arrested in Delhi after encounter; police probing terror links : పలు ఉగ్రవాగ సంస్ధలతో సంబంధాలు ఉన్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని షాకర్ పూర్ ప్రాంతంలో వారితో జరిపిన ఎదురు కాల్పులు అనంతరం అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీసు కమీషనర్ ప్రమోద్ సింగ్ కుష్వా తెలిపారు.
వీరిలో ఇద్దరిది పంజాబ్ కాగా, ముగ్గురు కాశ్నీరీలు అని ఆయన తెలిపారు. వీరికి పలు ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలున్నట్లు తెలిసిందని విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. నిందితుల వద్ద నుంచి తుపాకులు, మారణాయుధాలు పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
