Girls Raped Man : సీన్ రివర్స్.. అబ్బాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన నలుగురు అమ్మాయిలు..!

నలుగురు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి రేప్ చేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.

Girls Raped Man : దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలకు రక్షణ కరువైందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే, సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడా పరిస్థితి అబ్బాయిలకూ వచ్చిందా? మగాళ్లకూ రక్షణ కరువైందా? అన్న అనుమానం మొదలైంది. దీనికి కారణం పంజాబ్ లో జరిగిన షాకింగ్ ఘటనే. నలుగురు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని ఏకంగా కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు.

నలుగురు అమ్మాయిలు ఒక యువకుడిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఘటన పంజాబ్ లోని జలంధర్ లో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. 22 నుంచి 23ఏళ్ల మధ్య ఉన్న నలుగురు అమ్మాయిలు.. కారులో వచ్చారని.. తనను ఓ అడ్రస్ అడిగారని అతడు చెప్పాడు. అడ్రస్ చెబుతుండగా.. తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని.. తర్వాత మత్తుమందు ఇచ్చి ఒక రాత్రంతా రేప్ చేశారని తెలిపాడు. ఆ తర్వాత తనని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారని వివరించాడు. ఈ విషయాన్ని అతడు స్థానిక మీడియాకు తెలియజేశాడు.

”నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నా. అదే సమయంలో ఓ తెల్ల కారు వచ్చింది. అందులో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కారు నడుపుతున్న అమ్మాయి నాకో పేపర్ ఇచ్చింది. అందులో అడ్రస్ గురించి చెప్పాలంది. నేను ఆ స్లిప్ చూస్తున్నా. ఇంతలో నా కళ్లలో ఏదో కెమికల్ చల్లింది. దీంతో నా కళ్లు కనిపించ లేదు. ఆ తర్వాత నా కళ్లకు గంతలు కట్టారు. నా చేతులు కట్టేశారు. నన్ను కిడ్నాప్ చేసి కారులో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ అమ్మాయిలంతా మందు తాగారు. నన్నూ తాగమని బలవంతం చేశారు. నాకు మత్తుమందు ఇచ్చారు. నేను స్పృహ కోల్పోయాక నన్ను రేప్ చేశారు. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో నన్ను ఓ ప్రాంతంలో పడేసి పోయారు” అని అతడు చెప్పాడు.

కాగా, దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్థానిక మీడియాకు మాత్రమే ఈ విషయాన్ని చెప్పాడు. ఇంత ఘోరం జరిగింది కదా, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని మీడియా వాళ్లు అడిగితే.. తనకు పెళ్లైందని, పిల్లలు ఉన్నారని అందుకే పోలీసులకు చెప్పలేదని అతగాడు వివరించాడు. ప్రాణాలతో తిరిగి వచ్చారు, అదే చాలు, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని నా భార్య నన్ను వేడుకుంది, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అతగాడు చెప్పాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ వ్యక్తి ఓ లేబర్. లెదర్ ఫ్యాక్టరీలో పని చేస్తాడు. లైంగిక దాడి చేసేందుకే ఆ అమ్మాయిలు తనను కిడ్నాప్ చేశారని అతడు చెప్పాడు. ఆ నలుగురు అమ్మాయిలు మంచి కుటుంబాలకు చెందిన వారిలా అనిపించారని అతడు తెలిపాడు. అందరూ తమలో తాము ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకున్నారని వివరించాడు. తనతో మాత్రం పంజాబీలోనే మాట్లాడారని చెప్పాడు.

కాగా.. నలుగురు అమ్మాయిలు ఓ మగాడిని కిడ్నాప్ చేసి రేప్ చేశారనే వార్త సంచలనం రేపింది. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రేప్ వార్తల నేపథ్యంలో సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. నిజానిజాలు తేల్చే పనిలో పడ్డారు. అతడు చెప్పింది నిజమా? లేక కట్టుకథా? అనేది త్వరలోనే తేలుస్తామన్నారు పోలీసులు.