×
Ad

Mumbai Dentist: ఏదో ఒకరోజు శ్రద్ధా వాకర్‌లా.. నువ్వు కూడా ఫ్రిడ్జ్‌లో దొరుకుతావు.. అంటూ ప్రియుడి బెదిరింపులు

ఆ సూసైడ్ నోట్ ద్వారా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు గురించి కూడా స్తుతి అందులో ప్రస్తావించింది.

  • Published On : March 10, 2026 / 07:38 PM IST

Stuti Sonwane Representative Image (Image Credit To Original Source)

 

  • ప్రియుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య
  • ఏదో ఒక రోజు నువ్వు కూడా ఫ్రిడ్జ్ లో దొరుకుతావు అంటూ పదే పదే బెదిరింపులు
  • తన ఇంట్లో ఉరి వేసుకున్న స్తుతి
  • స్తుతి రూమ్ లో 6 పేజీల సూసైడ్ నోట్ లభ్యం

Mumbai Dentist: ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పునావాలా శ్రద్ధాను అత్యంత కిరాతకంగా చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని రోజులపాటు ఫ్రిజ్ లో ఉంచాడు. ఆపై శరీర భాగాలను సూట్ కేసుల్లో తీసుకెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. 2022 మే 18న శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైంది. తాజాగా ఈ కేసుకి సంబంధించిన విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ముంబైలో స్తుతి అనే డెంటిస్ట్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసు విచారణలో శ్రద్ధా వాకర్ ప్రస్తావన తెరపైకి వచ్చింది.

నిత్యం అనుమానించే వాడే..

ఆమె పేరు స్తుతి సోన్ వాన్. వయసు 24 ఏళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటిస్ట్. ముంబైలో నివాసం ఉంటుంది. స్తుతి సోనోవాన్.. ప్రియుడి మానసిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. స్తుతి రూమ్ లో 6 పేజీల సూసైడ్ నోట్ లభించింది. ఆమె ఒక రిలేష‌న్‌లో ఉందని ఆ లెటర్ ద్వారా తెలిసింది. ప్రియుడు తనను తీవ్రంగా అనుమానించాడని, త‌న వ్య‌క్తిత్వాన్ని ప్రశ్నించాడని స్తుతి లేఖలో రాసింది. ఈ కారణంగానే తమ సంబంధం చెడిపోయిందని అందులో తెలిపింది.

ఆ సూసైడ్ నోట్ ద్వారా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు గురించి కూడా స్తుతి అందులో ప్రస్తావించింది. తన ప్రియుడితో తనకున్న ఇబ్బందుల గురించి తన స్నేహితులకు తెలుసు అని లేఖలో తెలిపిన స్తుతి.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఫ్రిజ్‌లో దొరుకుతావు అంటూ తరచుగా తన బాయ్ ఫ్రెండ్ తనతో జోక్ చేసేవాడ‌ని లేఖలో రాసింది.

ముంబైలోని ఆంటోప్ హిల్ లో స్తుతి తన తల్లిదండ్రులు, సోదరితో నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం 11 గంటలు అవుతున్నా.. సుత్తి తన రూమ్ నుంచి బయటకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు ఆందోళన చెందారు. వెంటనే స్తుతి రూమ్ దగ్గరికి వెళ్లారు. అయితే డోర్లు లాక్ చేసి ఉన్నాయి. దీంతో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా షాక్ అయ్యారు. స్తుతి సీలింగ్ కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే స్తుతి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో స్తుతి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రియుడి పాత్ర గురించి ఆరా తీస్తున్నారు.

Also Read: విజయ్ మాల్యా.. మీ విల్లా ధర ఎంతో చెప్పండి.. వైరల్‌గా మారిన స్టార్టప్ ఫౌండర్ లెటర్