పోర్న్ వీడియో రాకెట్ కేసులో సినీనటి అరెస్ట్!
- Sreehari A
- Updated on- February 7, 2021 / 01:32 PM IST
gehana vasisth:పోర్న్ వీడియో రాకెట్ కేసులో సినీనటి ఒకరు అరెస్ట్ అయ్యారు. పోర్న్ వీడియో షూటింగ్ చేసి.. వీడియోలను వెబ్ సైటులో అప్లోడ్ చేసే రాకెట్ ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సినీనటి, మోడల్ గెహ్నా వశిష్ట్ పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు సినీనటి గెహ్నాను విచారించారు.
ఇప్పటివరకూ 87 పోర్న్ వీడియోలను ఒక వెబ్ సైటులో అప్ లోడ్ చేసినట్టు కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఆదివారం గెహ్నాను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరు సినీనటులు, మోడల్స్ ఇతరుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
‘ఫిల్మీ దునియా’ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమకు నటి గెహ్నా పరిచయమయ్యారు. గెహ్నా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. 2007లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధనలో ఐటమ్ సాంగ్ లో నటించారు. ఆపరేషన్ దుర్యోధన 2, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, నమస్తే, 33 ప్రేమ కథలు, ఐదు, బీటెక్ లవ్ స్టోరీ వంటి పలు సినిమాల్లో గెహ్నా నటించారు.
ముంబై, మలద్లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో షూటింగ్ జరుగుతోందంటూ క్రైం బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. సదరు బంగ్లాపై పోలీసులు రైడ్ చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
