చిన్నారి ద్వారక హత్యాచారం కేసు : టీవీ చూసేందుకు అతడి ఇంటికి వెళ్లడమే పాపమైంది
కృష్ణాజిల్లా గొల్లపూడిలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల విచారణలో నిందితుడు ప్రకాశ్ కీలక విషయాలు వెల్లడించాడు.

కృష్ణాజిల్లా గొల్లపూడిలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల విచారణలో నిందితుడు ప్రకాశ్ కీలక విషయాలు వెల్లడించాడు.
కృష్ణాజిల్లా గొల్లపూడిలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల విచారణలో నిందితుడు ప్రకాశ్ కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఉద్దేశ పూర్వకంగానే ద్వారకను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. తాను ఉన్న గదిలోకి ద్వారక టీవీ చూడడానికి వచ్చిందని, ద్వారకపై తాను అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం అందుతోంది.
ద్వారక కేకలు వేయడంతో భయపడి.. గొంతు, ముక్కు నొక్కిపెట్టడంతో బాలిక చనిపోయిందని నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని ఎక్కడైనా పారవేసేందుకు సంచిలో మూట కట్టినట్లు ప్రకాశ్ పోలీసులకు వివరించాడు. ప్రకాశ్ కి నేర చరిత్ర ఉంది. గతంలో జి.కొండూరులో మూగ బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో ప్రకాశ్ 11 నెలలు జైలుకి వెళ్లి వచ్చాడు.
నవంబర్ 10న నల్లకుంటలో అదృశ్యమైన ద్వారక.. ఆ తర్వాత హత్యకు గురైంది. ద్వారక పక్కింట్లో ఉంటున్న ప్రకాశ్ నివాసంలో మృతదేహం కనిపించింది. మొవ్వ అనిల్, వెంకట రమణ భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో పనిచేస్తుండగా.. వెంకటరమణ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో స్వీపర్‌గా పని చేస్తోంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అబ్బాయిలను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారక మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటోంది. స్థానిక స్కూల్ లో 2వ తరగతి చదువుతోంది. వీరి పక్కింట్లో పెంటయ్య అలియాస్ ప్రకాష్ అద్దెకు ఉంటున్నాడు.
ఈ కేసుకి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. ద్వారక తల్లి నిందితుడు ప్రకాశ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఇది చూసిన ద్వారక తండ్రి ఎక్కడ చెబుతుందో అనే భయంతో.. ప్రియుడితో కలిసిన తల్లి.. ద్వారకను చంపేసిందని వార్తలొచ్చాయి.