Volunteer Misbehaviour : వివాహితతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన-కేసు నమోదు
గుంటూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
- chvmurthy
- Published On : October 25, 2021 / 11:36 AM IST
Volunteer Misbehaviour With Woman
Volunteer Misbehaviour : గుంటూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన వివాహిత పట్ల అదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ మల్ల గోపి రెండు రోజుల క్రితం బాధిత మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె పై అత్యాచారం చేయబోగా భయంతో మహిళ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని చెప్పి వాలంటీర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
Also Read : Encounter In Mulugu District : తెలంగాణలో ఎన్‌కౌంటర్- ముగ్గురు మావోయిస్టులు మృతి
బాధితురాలు స్ధానిక పోలీసు స్టేషన్ లో గ్రామవాలంటీర్ పై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలకు పాల్పడినా సహించేది లేదని వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ కోటయ్య హెచ్చరించారు.
