Happy Birthday Chor : దొంగకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన అపార్ట్మెంట్ వాసులు
ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లోకి వచ్చిన దొంగకు పుట్టినరోజు వేడుక జరిపి కేక్ కట్ చేయించి.... అప్పడు పోలీసులకు అప్పచెప్పారు ఆ అపార్ట్ మెంట్ వాసులు.
- chvmurthy
- Updated on- June 29, 2022 / 08:15 PM IST
Chor Birthday
Happy Birthday Chor : ఎక్కడైనా చోరీ చేయటానికి వచ్చిన దొంగలు దొరికిపోతే ఏమి చేస్తారు …. వాడికి నాలుగు తగిలించి పోలీసులకు అప్పచెపుతారు. వాడు ఎన్ని జాలిమాటలు చెప్పినా వాడి మాట ఎవరూ వినరు. కానీ ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లోకి వచ్చిన దొంగకు పుట్టినరోజు వేడుక జరిపి కేక్ కట్ చేయించి…. అప్పడు పోలీసులకు అప్పచెప్పారు ఆ అపార్ట్ మెంట్ వాసులు.
న్యూ ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోకి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వారిని గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు వారిని పట్టుకోటానికి వారి వెంట పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు పారిపోగా ఒక దొంగ దొరికాడు.
అతడిని పోలీసులకు అప్పగించేందుకు అందరూ సిధ్దమవుతుండగా భోరున ఏడవటం ప్రారంభించాడు. ఆరోజు తన పుట్టినరోజు అని… దయచేసి వదిలేయాలని ప్రాధేయ పడ్డాడు. దీంతో వారికి జాలి కలిగింది. అందరూ కలిసి కేక్ తెప్పించారు. కొద్దిసేపట్లోనే అపార్ట్ మెంట్ వాసులంతా సమావేశం అయి తమ కాలనీలోనే ఆ దొంగ పుట్టిన రోజు వేడుకలు జరిపించారు.
దొంగతో కేక్ కట్ చేయించారు. అతను తీసుకువచ్చిన కట్టర్ కుడా అక్కడ పెట్టి ఫోటోలు తీశారు. అపార్ట్ మెంట్ పెద్దలు దొంగకు కేకు తినిపించారు. అనంతరం ఆదొంగను పోలీసులకు పట్టించినట్టు తెలిసింది. ఇప్పడు ఆవీడియోను కొందరు సోషల్ మీడియాలో మళ్లీ పోస్ట్ చేశారు. ఈవీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లిస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగినట్లు కొందరు తెలిపారు.
