Hijra Trap: కోరిక తీరుస్తానంటూ ట్రాప్ చేసిన హిజ్రా.. రూమ్ కి తీసుకెళ్లి..

అతడి దగ్గర అంత సొమ్ము లేకపోవడంతో ఇంటికి వెళ్లి బంగారు గాజులు, ఆభరణాలు, క్యాష్ మొత్తం లక్ష 40వేలు విలువ చేసే సొమ్ము తీసుకొచ్చి హిజ్రాకు ఇచ్చాడు బాధితుడు.

  • Updated on- April 11, 2026 / 11:14 PM IST

 

Hijra Trap: కోరిక తీరుస్తానంటూ ప్రైవేట్ ఉద్యోగిని ట్రాప్ చేసి అతడి నుంచి లక్ష 40 వేలు కొట్టేసిందో హిజ్రా. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 28న టాస్ పబ్ దగ్గర ప్రైవేట్ ఉద్యోగిని హిజ్రా కలిసింది. లైంగిక కోరిక తీరుస్తానంటూ అతడిని ట్రాప్ చేసింది. మాయ మాటలు చెప్పి అతడిని రూమ్ కి తీసుకెళ్లింది. ముందుగా 3వేల 500 రూపాయలకు డీల్ మాట్లాడుకుంది హిజ్రా.

రూమ్ కి వెళ్ళాక హిజ్రా తన అసలు స్వరూపం బయటపెట్టింది. ఉద్యోగిని బెదిరింపులకు గురి చేసింది. 2 లక్షలు డిమాండ్ చేసింది. అయితే, అంత సొమ్ము అతడి దగ్గర లేకపోవడంతో ఇంటికి వెళ్లి బంగారు గాజులు, ఆభరణాలు, క్యాష్ మొత్తం లక్ష 40వేలు విలువ చేసే సొమ్ము తీసుకొచ్చి హిజ్రాకు ఇచ్చాడు బాధితుడు. శనివారం బాధితుడి ఇంటి దగ్గరికి వెళ్లిన హిజ్రా.. తన దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయి అంటూ బాధితుడిని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమో చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మంగ్లీపై కేసు.. అడ్వకేట్ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు.. సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి..