Wife Extra Marital Affair : వివాహేతర సంబంధం-భార్యను చంపి మామకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు
భార్య వివాహేతరం సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన భర్త కోపం పట్టలేక భార్యను రోకలి బండతో హత్యచేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
- chvmurthy
- Published On : November 19, 2021 / 10:57 AM IST
Extra Marital Affair
Wife Extra Marital Affair : భార్య వివాహేతరం సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన భర్త కోపం పట్టలేక భార్యను రోకలి బండతో హత్యచేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
కదిరి మండలంలోని పట్నం గ్రామానికి చెందిన శివశంకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం ఇతనికి సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28)తో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఏడేళ్ల కొడుకు మురళి, ఐదేళ్ళ కుమార్తె కీర్తన ఉన్నారు.
హేమలత పట్నం గ్రామానికే చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టకుంది. ఈవిషయాన్ని శివశంకర్ పసిగట్టాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోమని ఆమెతో చాలాసార్లు చెప్పాడు. పలుమార్లు పధ్ధతి మార్చుకోమని హెచ్చరించినా వినిపించుకోలేదు.
బుధవారం శివశంకర్ ఆటో తీసుకుని కిరాయిల కోసం వెళ్లాడు. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చే సరికి భార్య హేమలత రామాంజనేయులుతో సన్నిహితంగా ఉండటం చూశాడు. ఆగ్రహం పెల్లుబికింది. ఇంట్లోకి వచ్చి దగ్గరలో ఉన్న రోకలి బండ తీసుకుని ఆమె తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శివశంకర్ కోపం చూసిన రామాంజనేయులు అక్కడినుంచి పారిపోయాడు.
Also Read : BJP MLA Pratap Bheel Rape Case : ఉద్యోగం పేరుతో మహిళలపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే
కొద్ది సేపటి తర్వాత తేరుకున్న శివశంకర్ తన మామ గోపాలప్పకి (హేమలత తండ్రి) ఫోన్ చేసి చెప్పాడు. నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది. వద్దు అని పలుమార్లు హెచ్చరించినా వినలేదు. ఈరోజు నాకళ్లేదుటే పట్టుబడింది. అందుకే నీకూతుర్ని చంపేశానని చెప్పాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని శివశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
