×
Ad

Husband Suicide : భార్యతో గొడవపడిన భర్త…. కరెంట్ వైర్లు పట్టుకుని….

వ్యసనాలకు బానిసైన భర్త, భార్య డబ్బులివ్వలేదని హైటెన్షన్ కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Husband Suicide In Hyderabad Due To Bad Habits

Husband Suicide : వ్యసనాలకు బానిసైన భర్త, భార్య డబ్బులివ్వలేదని హైటెన్షన్ కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మలక్ పేట, సైదాబాద్ లోని అక్బర్ బాగ్ లో ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే  వ్యక్తి వ్యసనాలకు బానిసయ్యాడు.

సోమవారం  మద్యం సేవించటానికి  భార్యను డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వలేదు. ఇద్దరిమధ్య గొడవ జరిగింది. భార్యపై కోపంతో దిల్ కుషా ఫంక్షన్ హాల్ సమీపంలోని విద్యుత్ ట్రాన్సఫార్మర్ ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.